Site icon NTV Telugu

Netanyahu: హమాస్‌ను పూర్తిగా తుడిచి పెట్టేస్తాం.. ఇజ్రాయెల్ ప్రధాని ప్రకటన

Netanyahu

Netanyahu

గాజాతో 60 రోజుల పాటు కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హమాస్ ఉండదు… హమస్థాన్ ఉండదంటూ నెతన్యాహు వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గబోమని.. హమాస్‌ను పూర్తిగా పునాదులు లేకుండా చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు.

ఇది కూడా చదవండి: Mysaa Movie: రష్మిక.. ‘మైసా’ టైటిల్ అంటే అర్థం ఏంటో తెలుసా..?

కాల్పుల విరమణకు కొత్త ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు హమాస్ వెల్లడించింది. ఇజ్రాయెల్ దళాలు.. గాజా నుంచి ఉపసంహరించుకునేలా చేయడమే తమ లక్ష్యమని హమాస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తుల నుంచి తమకు సూచనలు వచ్చాయని, వాటిని సమీక్షిస్తున్నామని హమాస్ బృందం పేర్కొంది. ఈ ప్రకటన వెలువడిన తర్వాత నెతన్యాహు ఈ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. హమాస్‌ను పూర్తిగా పునాదులు లేకుండా చేయడమే తమ టార్గెట్ అని నెతన్యాహు స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Young hero : హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు విశ్వ ప్రయత్నాలు

2023, అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి 200 మందికి పైగా బందీలుగా తీసుకెళ్లిపోయింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్.. హమాస్ అంతమే లక్ష్యంగా యుద్ధం చేస్తోంది. గాజాను పూర్తిగా నాశనం చేసింది. అయితే తాజాగా ట్రంప్ ఒక ప్రకటన చేశారు. 60 రోజుల కాల్పుల విరమణకు హమాస్-ఇజ్రాయెల్ అంగీకరించాయని తెలిపారు. కానీ అందుకు భిన్నంగా నెతన్యాహు హెచ్చరికలు ఉన్నాయి. హమాస్ అంతమే లక్ష్యమని వెల్లడించారు. దీనిపై ట్రంప్ ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇది కూడా చదవండి: Drones in War: యుద్ధరంగంలో సరికొత్త శకం.. కీలకంగా వ్యవహరిస్తున్న డ్రోన్లు..

Exit mobile version