NTV Telugu Site icon

Israel-Hezbollah: లెబనాన్‌ను ఖాళీ చేసి వెళ్లిపోండి.. ఇజ్రాయెల్ హెచ్చరిక

Israil

Israil

Israel-Hezbollah: హెజ్‌బొల్లా గ్రూప్ ను నిర్వీర్యం చేసేందుకు ఇజ్రాయెల్ రెడీ అయింది. అందులో భాగంగానే లెబనాన్‌లో ఆ గ్రూప్‌పై వరుస దాడులతో ఇజ్రాయెల్ ఐడీఎఫ్ విరుచుకుపడుతుంది. భూతల దాడులు చేసేందుకు ఇప్పటికే ఇజ్రాయెల్ సేనలు ఆ దేశంలోకి ప్రవేశించాయి. ఈ తరుణంలో సరిహద్దు ప్రాంతాల్లోని లెబనాన్ పౌరులు తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేసింది ఇజ్రాయెల్ ఆర్మీ. దీనికి సంబంధించిన ప్రకటనను ఆ దేశ సైన్యం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది.

Read Also: Kakani Govardhan Reddy: తిరుపతి లడ్డూ వివాదంపై మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు

కాగా, సరిహద్దు నుంచి 60 కిలో మీటర్ల దూరంలో ఉంటున్న పౌరులంతా తమ ఇళ్లను ఖాళీ చేయాలని అందులో ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. 2006లో ఇజ్రాయెల్‌- హెజ్‌బొల్లా యుద్ధం తర్వాత రెండింటి మధ్య ఐక్యరాజ్య సమితికొంత ప్రాంతాన్ని బఫర్ జోన్‌గా ప్రకటించింది. దాని ఉత్తర భాగంలో లిటానీ నది ఉంది.. సరిహద్దు నుంచి అక్కడి వరకు 30 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఇప్పుడు ఇజ్రాయెల్‌ ఖాళీ చేయమన్న ప్రాంతం దానిని మించి ఉంది అన్నమాట.

Read Also: SEBI: మరింత ఈజీగా పాసివ్ ఫండ్స్‌‌.. రూల్స్ సులభతరం చేసిన సెబీ

అలాగే, ఇజ్రాయెల్‌ భూతల దాడుల గురించి ప్రకటన చేసిన తర్వాత తొలిసారి హెజ్‌బొల్లా రియాక్ట్ అయింది. ఆ గ్రూప్ ప్రతినిధి మహమ్మద్‌ ఆఫిఫి మాట్లాడుతూ.. ఇజ్రాయెల్‌ బలగాలు లెబనాన్‌లోకి ప్రవేశించాయనేది అవాస్తవం.. శత్రువులతో నేరుగా పోరాడేందుకు తమ ఫైటర్స్ రెడీగా ఉన్నారని చెప్పారు. ఇజ్రాయెల్‌ వైపు మధ్యశ్రేణి క్షిపణులు ప్రయోగించాం.. అది ప్రారంభం మాత్రమే అని హెజ్‌బొల్లా హెచ్చరించింది.

Show comments