Site icon NTV Telugu

Gaza-Israel: గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 19 మంది మృతి

Gazaisrael

Gazaisrael

హమాస్-ఇజ్రాయెల్ మధ్య 60 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయినా కూడా గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆగలేదు. తాజాగా ఆదివారం కూడా ఐడీఎఫ్ దాడులు చేసింది. గాజాలోని సాధారణ పౌరులపై దాడులు జరిగాయి. ఓ ప్రాంతంలో తాగునీటి కోసం నిలబడిన జనసమూహంపై దాడులు చోటుచేసుకున్నాయి. ఈ దాడిలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ మేరకు పాలస్తీనా ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి.

ఇది కూడా చదవండి: Botsa Satyanarayana: చంద్రబాబు, పవన్ ప్రజలను మోసం చేశారు.. బొత్స సంచలన వ్యాఖ్యలు..

సెంట్రల్ గాజాలోని నుసెరాత్‌లోని నీటి సేకరణ కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి తర్వాత 10 మృతదేహాలను అందుకున్నట్లు సెంట్రల్ గాజాలోని అల్-అవ్దా ఆసుపత్రి అధికారులు తెలిపారు. మృతుల్లో ఆరుగురు పిల్లలు ఉన్నారని ఆసుపత్రి తెలిపింది. ఇక ఆ ప్రాంతంలో నివసించే ప్రత్యక్ష సాక్షి రమదాన్ నాసర్ మాట్లాడుతూ.. ఆదివారం ఉదయం దాదాపు 20 మంది పిల్లలు, 14 మంది పెద్దలు నీటిని నింపుకోవడానికి వరుసలో నిలబడ్డారని చెప్పారు. ఆ సమయంలో కాల్పులు జరిగినట్లుగా తెలిపారు.

ఇది కూడా చదవండి: Chhangur Baba: ఛంగూర్ బాబాకు పాక్ ఐఎస్ఐతో సంబంధాలు..

హమాస్-ఇజ్రాయెల్ శాంతి చర్చల్లో పురోగతి దొరకడం లేదని తెలుస్తోంది. హమాస్.. గాజా నుంచి ఇజ్రాయెల్ దళాలు వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తోంది. ఇజ్రాయెల్ ఏమో బందీలను విడుదల చేయాలని కోరుతుంది. దీంతో ఈ చర్చలు ఓ కొలిక్కి రావడం లేదు. ఇక ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికాకు వెళ్లాక వ్యూహం కూడా మారినట్లు తెలుస్తోంది. హమాస్‌పై యుద్ధం కొనసాగించాలనే ఇజ్రాయెల్ భావిస్తోంది. అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే నెతన్యాహు యుద్ధం చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఒప్పందం సాధ్యాసాధ్యాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Exit mobile version