Site icon NTV Telugu

Gaza-Israel: గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 90 మంది మృతి

Gaza

Gaza

హమాస్ లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా మరింత తీవ్రమైంది. గత 48 గంటల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 90 మందికి పైగా మృతిచెందారు. ఈ మేరకు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది.

ఇది కూడా చదవండి: IPL 2025: కోట్లు పెట్టి కొన్నా.. ఈ 5 మంది ప్లేయర్ల ప్రదర్శన మాత్రం సున్నా!

బందీలను విడుదల చేసేంత వరకు యుద్ధం కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. హమాస్‌పై మరింత ఒత్తిడి పెంచుతోంది. గాజా అంతటా దాడులను తీవ్రతరం చేస్తామని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది. అలాగే ఆరు వారాలు గాజాను దిగ్బంధించి ఆహారం, ఇతర వస్తువులు వెళ్లకుండా ఇజ్రాయెల్ ప్రవేశాన్ని నిషేధించింది. ఇప్పటికే హాషకాహార లోపంతో అనేక మంది పిల్లలు చనిపోతున్నారు. వాహనాల ప్రవేశాన్ని నిషేధించడంతో పరిస్థితి మరింత తీవ్రం కానుంది.

ఇది కూడా చదవండి: MUKUNDA Jewellers : చందానగర్‌లో ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ ఔట్లెట్ ప్రారంభం

ఇక మరణించిన వారిలో మహిళలు, పిల్లలు ఉన్నారు. వీళ్లంతా ఒక ఆశ్రయంలో ఉండగా దాడి జరిగిందని అధికారులు తెలిపారు. ఇక రఫా నగరంలో జరిగిన వేర్వేరు దాడుల్లో ఒక తల్లి, ఆమె కుమార్తె సహా మరో నలుగురు మరణించారని మృతదేహాలను తీసుకువచ్చిన యూరోపియన్ హాస్పిటల్ తెలిపింది.

ఇది కూడా చదవండి: GT vs DC: వాహ్.. ఢిల్లీ బ్యాటర్ల సమష్టి కృషి.. .. గుజరాత్ టైటాన్స్ లక్ష్యం 204

Exit mobile version