Site icon NTV Telugu

Israel: గాజాతో పాటు సిరియా, లెబనాన్‌పై కూడా ఐడీఎఫ్ దాడి.. 10 మంది మృతి

Lebanon

Lebanon

ఇజ్రాయెల్ మరోసారి యుద్ధానికి శ్రీకారం చుట్టింది. గాజాలో హమాస్ అంతమే లక్ష్యంగా ఐడీఎఫ్ దళాలు భీకరదాడులకు పాల్పడింది. హమాస్ ఉగ్రవాద సంస్థలపై దాడులు చేయగా 300 మంది చనిపోయారు. పదులకొద్దీ గాయాలు పాలయ్యారు. ఇక గాజాతో పాటు దక్షిణ సిరియా, లెబనాన్‌పై కూడా వైమానిక దాడులకు తెగబడింది. ఈ ఘటనలో 10 మంది చనిపోగా.. 52 మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పరిస్థితులు మరింత దిగజారకుండా లెబనాన్ దిగొచ్చినట్లుగా తెలుస్తోంది. కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటామని తెలిపినట్లుగా సమాచారం.

ఇది కూడా చదవండి: Danam Nagender: ఇది సీరియస్ మ్యాటర్.. జీరో అవర్ లో దానం గరం గరం

ఇటీవల అంతర్జాతీయ మధ్యవర్తుల చర్చలతో గాజా-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ జరిగింది. జనవరి 19 నుంచి ఖైదీ-బందీల మార్పిడి జరిగింది. అయితే ఇటీవల తొలి విడత ఒప్పందం ముగిసింది. అయితే ఈ ఒప్పందాన్నే కొనసాగించాలని ఇజ్రాయెల్ కోరింది. కానీ అందుకు హమాస్ ససేమిరా అంది. అనంతరం అంతర్జాతీయ మధ్యవర్తుల ద్వారా కూడా హమాస్‌తో మాట్లాడించింది. అయినా కూడా హమాస్ అంగీకరించలేదు. ఇక అమెరికా జోక్యం పుచ్చుకుని.. బందీలందరినీ ఒకేసారి విడుదల చేయకపోతే నరకం చూస్తారని హమాస్‌కు ట్రంప్ తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. ఏ మాత్రం హమాస్ లొంగలేదు. రెండో విడత ఒప్పందం ప్రకారమే బందీలను విడుదల చేస్తామని హమాస్ తేల్చి చెప్పింది.

ఇది కూడా చదవండి: Janhvi Kapoor : ఆ ప్రమాధం నా జీవితంలో మర్చిపోను..

దీంతో ఇజ్రాయెల్, అమెరికా.. హమాస్‌పై పగతో రగిలిపోయింది. సోమవారం అర్ధరాత్రి నుంచి హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకరదాడులు చేసింది. ఈ మేరకు ఐడీఎఫ్ ట్విట్టర్ తెలియజేసింది. అలాగే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా స్పందిస్తూ.. హమాస్.. బందీలను విడుదల చేయకపోవడంతోనే దాడులు చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా జరిగిన దాడిలో 300 మంది చనిపోయారు. అలాగే సిరియా, లెబనాన్‌పై కూడా దాడి చేయగా 10 మంది చనిపోయారు.

ఇక ఈ దాడులపై అమెరికా వైట్‌హౌస్ స్పందించింది. ఇజ్రాయెల్.. తమకు సమాచారం తెలియజేశాకే.. దాడులు చేసిందని స్పష్టం చేసింది. ఇక ఈ దాడులను హమాస్ ఖండించింది. ఇజ్రాయెల్.. తన బందీలను త్యాగం చేయాలనుకుంటున్నట్లుగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది.

ఇది కూడా చదవండి: Gold Rates Today: అమ్మబాబోయ్.. మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?

Exit mobile version