NTV Telugu Site icon

Ismail Haniyeh: హమాస్ చీఫ్ హనియేకి ఎదురుదెబ్బ.. ఇజ్రాయిల్ దాడిలో 10 మంది కుటుంబీలకు మృతి..

Hamas

Hamas

Israeli Air Strike: హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేకి భారీ ఎదురుదెబ్బ తాకింది. గతేడాది నుంచి హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం జరుగుతోంది. అక్టోబర్ 07 నాటి హమాస్ దాడికి ప్రధాన సూత్రధారుల్లో హమాస్ నేత హనియే ఒకరని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ హనియేను మట్టుపెట్టేందుకు టార్గెట్ చేస్తోంది. తాజాగా ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడిలో హనియే కుటుంబంలోని 10 మంది మరణించారని గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ మంగళవారం తెలిపింది. అయితే, దీనిని ఇజ్రాయిల్ సైన్యం ఇంకా ధృవీకరించలేదు. అనేక మృతదేహాలు శిథిలాల కింద ఉన్నాయని, అయితే, వాటిని వెలికి తీయడానికి అవసరమైన పరికరాలు తమ వద్ద లేవని గాజాలోని అధికారి మహ్మద్ బసల్ తెలిపారు.

Read Also: Prabhas : ప్రభాస్ కు ఇంకా ఆ గాయం తగ్గలేదా.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..

హమాస్‌కి పొలిటికల్ బ్యూరో ఛీఫ్‌గా ఉన్న హనియే ఖతార్‌లో ఉంటున్నాడు. అంతకుముందు సెంట్రల్ గాజాలో ఏప్రిల్ నెలలో జరిగిన ఇజ్రాయిల్ దాడిలో ముగ్గురు కుమారులు, నలుగురు మనవళ్లను కోల్పోయాడు. కొన్ని నివేదికల ప్రకారం.. అతని కుటుంబంలో దాదాపుగా 60 మంది సభ్యులు మరణించారు. తాజాగా దాడిలో హనియే సోదరి జహర్ హనియే సహా 10 మంది మరణించారని తెలుస్తోంది. మరోవైపు గాజా కాల్పుల విరమణ, బందీల ఒప్పందానికి ఇజ్రాయిల్ కట్టుబడి ఉందని సోమవారం ఇజ్రాయిల్ ప్రధాని జెంజమిన్ నెతన్యాహూ చెప్పారు. మరోవైపు హమాస్‌ని పూర్తిగా మట్టుపెట్టేవరకు యుద్ధాన్ని ముగించమని పార్లమెంట్‌లో చెప్పారు.

గతేడాది అక్టోబర్ 07న ఇజ్రాయిల్‌పై హమాస్ మిలిటెంట్లు విరుచుకపడ్డారు, వందలాది రాకెట్లతో దాడి చేశారు. సరిహద్దుల్లోని ఇజ్రాయిల్ గ్రామాల్లోకి చేరి మారణహోమం సృష్టించారు. ఈ దాడిలో 1200 మంది మరణించగా, 240 మందిని హమాస్ బందీలుగా పట్టుకుంది. అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. హమాస్‌‌ని పూర్తిగా మట్టుబెట్టే వరకు యుద్ధాన్ని ఆపేది లేదని ఇజ్రాయిల్ స్పష్టం చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటికే 30 వేలకు పైగా పాలస్తీనియన్లు మరణించారు.