Israel-Iran War: ఇరాన్‌పై ఇజ్రాయిల్ భీకర దాడులు, టెహ్రాన్‌పై బాంబుల వర్షం..
- ఇరాన్‌పై ఇజ్రాయిల్ భీకర దాడులు..
- టెహ్రాన్‌లోని చాలా ప్రాంతాల్లో అటాక్స్..
- ఇరాన్ గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసిన తర్వాత ఇజ్రాయిల్ దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Iran War: ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీని ఇజ్రాయిల్, అమెరికా దాడులు చేసి చంపేశాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యంలోని అన్ని దేశాలు ఈ యుద్ధంలోకి లాగబడ్డాయి. ఇరాన్ ప్రతీకారంగా యూఏఈ, సౌదీ అరేబియా ,ఖతార్‌లపై విరుచుకుపడుతోంది. క్షిపణులతో దుబాయ్, అబుదాబి, ఖతార్ సిటీలను టార్గెట్ చేస్తోంది. పెద్ద ఎత్తున ఈ నగరాల్లో శబ్ధాలు వినిపించాయి. దుబాయ్, అబుదాబి ఎయిర్‌పోర్టుల్ని ఇరాన్ టార్గెట్ చేసింది.
ఇదిలా ఉంటే, మరోవైపు ఇజ్రాయిల్ భారీ స్థాయిలో ఇరాన్‌పై విరుచుకుపడుతోంది. ఆదివారం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేసింది. నగర వ్యాప్తంగా పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ స్టేట్ మీడియా ఆఫీసుపై ఇజ్రాయిల్ దాడి జరిగింది. ఖమేనీ హతమైన ఒక రోజు తర్వాత ఇజ్రాయిల్ ఈ దాడులు చేసింది. “ఐడిఎఫ్ టెహ్రాన్ నడిబొడ్డున ఇరాన్ ఉగ్రవాద పాలనకు చెందిన లక్ష్యాలను ఛేదిస్తోంది. గత రోజులో, ఇజ్రాయెల్ వైమానిక దళం వైమానిక ఆధిపత్యాన్ని స్థాపించడానికి మరియు టెహ్రాన్‌కు మార్గం సుగమం చేయడానికి పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది” అని ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) తెలిపాయి.
Also Read
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
- PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
పేలుళ్ల కారణంగా టెహ్రాన్ గగనతలంలో భారీగా పొగలు కనిపించాయి. ఖమేనీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిజ్ఞ చేసి మిడిల్ ఈస్ట్‌లోని ఇతర దేశాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడిన కొన్ని గంటల తర్వాత ఇజ్రాయిల్ ఇరాన్‌పై ప్రతిదాడులు మొదలుపెట్టింది. మధ్యప్రాచ్యంలోని యూఏఈ, ఖతార్, కువైట్, జోర్డాన్, సౌదీ అరేబియాలు ఇరాన్ దాడుల ఫలితంగా తమ ఎయిర్ స్పేస్ మూసివేశాయి. శనివారం నాటి యూఎస్ ఇజ్రాయిల్ దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనవరాలు మరణించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. దీనికి ప్రతీకారం తప్పదని ఇరాన్ అమెరికాను, ట్రంప్, ఇజ్రాయిల్‌ను హెచ్చరించింది.
Heavy Israeli Air Force airstrikes ongoing in Iran’s capital, Tehran right now. pic.twitter.com/BvAGnTgkF4
— OSINTtechnical (@Osinttechnical) March 1, 2026
‼️WATCH: For the first time since the start of Operation ‘Roaring Lion’, the IAF is striking targets belonging to the Iranian terror regime in the heart of Tehran.
Over the past day, the IAF conducted large-scale strikes to establish aerial superiority and pave the path to… pic.twitter.com/DN2MkGCfWc
— Israel Defense Forces (@IDF) March 1, 2026
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!