Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Israel Lebanon War Airstrikes Death Toll 254 Middle East Tensions

Israel-Lebanon War: లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 254కు చేరిన మృతులు

Published Date :April 9, 2026 , 8:01 am
By Suresh Maddala
  • లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు
  • 254కు చేరిన మృతులు, 1,000 మందికి గాయాలు
  • గురువారాన్ని జాతీయ సంతాప దినంగా ప్రకటించిన లెబనాన్
Israel-Lebanon War: లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 254కు చేరిన మృతులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

లెబనాన్‌పై ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. బుధవారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మృతుల సంఖ్య 254కు చేరింది. వందలాది మంది గాయపడ్డారు. ప్రస్తుతం లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

L1

ఇరాన్-అమెరికా మధ్య 2 వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దీనికి ఇజ్రాయెల్ కూడా మద్దతు తెలిపింది. దీంతో 40 రోజుల యుద్ధానికి తెరపడిందని అంతా భావించారు. రెండు వారాల పాటు పశ్చిమాసియా ప్రశాంతంగా ఉంటుందని భావించారు. కానీ బుధవారం అందుకు భిన్నంగా వాతావరణం నెలకొంది. ఈ ఒప్పందం లెబనాన్‌కు వర్తించదని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. అంతేకాకుండా ఒక్కసారిగా వైమానిక దాడులతో లెబనాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. భారీ భవంతలు కూలిపోయాయి. ఇప్పటి వరకు 254 మంది చనిపోగా.. వందలాది మంది గాయపడ్డారు.

అసలేం జరిగిందంటే..
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. ఆయనతో పాటు కీలక నేతలంతా మృత్యువాత పడ్డారు. అయితే ఇరాన్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై లెబనాన్ వైమానిక దాడులు చేసింది. దీంతో ప్రతీకారంగా హిజ్బుల్లా ఉగ్రవాదులే లక్ష్యంగా దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. తాజాగా ఇరాన్‌తో జరిగిన ఒప్పందం లెబనాన్‌కు ఏ మాత్రం వర్తించదని ఇజ్రాయెల్ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ భారీ స్థాయిలో దాడులు చేసింది.

L

అయితే లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేయడాన్ని ఇరాన్ జీర్ణించుకోలేపోయింది. ఒప్పందం ఉల్లంఘించారంటూ ధ్వజమెత్తింది. అయితే ఈ ఒప్పందం లెబనాన్‌కు వర్తించదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా తేల్చి చెప్పారు. ఒప్పందంలో లెబనాన్ కూడా ఉందని టెహ్రాన్ పొరబడిందని… వాస్తవానికి దానికి అమెరికా అంగీకరించలేదని తేల్చి చెప్పారు.

ఇదిలా ఉంటే లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులను పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, స్పెయిన్ ప్రధాన మంత్రి పెడ్రో సాంచెజ్ ఖండించారు. ఇజ్రాయెల్ దాడులతో లెబనాన్‌లో ఐదో వంతు మంది నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి తెలిపింది.

ఇక ఇజ్రాయెల్ జరిపిన దాడుల అనంతరం గురువారాన్ని జాతీయ సంతాప దినంగా లెబనాన్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 254 మందికి పైగా మరణించగా.. 1,000 మందికి పైగా గాయపడినట్లు తెలిపింది. ఇజ్రాయెల్ హత్యా యంత్రాగాన్ని అడ్డుకునేందుకు దౌత్య ప్రయత్నాలు చేస్తున్నట్లు లెబనాన్ ప్రధానమంత్రి నవాఫ్ సలాం కార్యాలయం తెలిపింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Beirut airstrikes
  • global reactions Israel Lebanon
  • Iran-US Ceasefire News
  • Israel Airstrikes Lebanon
  • Israel Hezbollah attacks

తాజావార్తలు

  • KKR vs LSG: తొలి విజయం కోసం ఎదురుచూపులు.. నేడు లక్నోతో కేకేఆర్ ఢీ

  • Israel-Lebanon War: లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 254కు చేరిన మృతులు

  • David Miller: డ్రామా, థ్రిల్లర్, చివరికి నిరాశ.. ఆ చివరి ఓవర్‌లో అసలేం జరిగింది? మిల్లర్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కి పాల్పడ్డాడా?

  • Pakistan Fuel Prices: పాకిస్థాన్‌లో ఇంధన ధరల పెరుగుదల.. లాహోర్‌లో ఆటో డ్రైవర్ల నిరసన

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions