Site icon NTV Telugu

Israel-Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకరదాడులు.. హిజ్బుల్ నేతల లక్ష్యంగా దాడులు

Israellebanon

Israellebanon

ఇజ్రాయెల్ మరోసారి లెబనాన్‌పై విరుచుకుపడుతోంది. ఒకేసారి ఇరాన్, లెబనాన్‌పై ఐడీఎఫ్ దళాలు దాడులు చేస్తున్నారు. ఇరాన్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై లెబనాన్ దాడులు చేసింది. దీంతో ఇజ్రాయెల్‌కు చిర్రెత్తి.. ఒకేసారి ఆ రెండు దేశాలపై దాడులు చేస్తోంది. తాజా దాడుల్లో హిజ్బుల్లా అగ్ర నాయకులు సహా పలువురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 30 మంది చనిపోయినట్లుగా లెబనాన్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే 149 మంది గాయపడినట్లుగా వెల్లడించింది.

ప్రస్తుతం లెబనాన్ రాజధాని బీరూట్‌పై ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం కురిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. గాజాపై యుద్ధం జరుగుతున్న సమయంలో లెబనాన్ జోక్యం చేసుకుంది. దీంతో ఇజ్రాయెల్ దాడులతో వణికిపోయింది. దీంతో నవంబర్. 2024న కాల్పుల విరమణ జరిగింది. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై రాకెట్లు డ్రోన్లు ప్రయోగించింది. ఆనాటి నుంచి ఇజ్రాయెల్‌పై దాడి చేయడం ఇదే తొలిసారి. ఇక ప్రతీకారంగా ఇప్పుడు బీరూట్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది.

 

Exit mobile version