Site icon NTV Telugu

Iran-Israel War: ఇరాన్ పై బాంబుల వర్షం.. ఏకంగా 20 ఎయిర్‌ఫోర్స్‌ ఫైటర్‌ జెట్లతో దాడి

Iran

Iran

Iran-Israel War: ఇజ్రాయెల్- ఇరాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో టెల్ అవీవ్ తాజాగా భారీ స్థాయిలో దాడులకు దిగింది. టెహ్రాన్ పై బాంబుల వర్షం కురిపించింది. సుమారు 20 ఫైటర్ జెట్లతో ఈ దాడిలో 30కి పైగా బాంబులను ప్రయోగించినట్లు టెల్ అవీవ్ రక్షణ శాఖ అధికారికంగా వెల్లడించింది. ఈ దాడులు తమ భూభాగాన్ని టార్గెట్ గా చేసుకుని నిల్వ చేసిన క్షిపణులు ఉన్న స్థావరాలపై జరిగాయని తెలిపింది. ఇది తమను తాము రక్షించుకోవడానికి మాత్రమే ఈ దాడి చేశామని ఇజ్రాయెల్ వాదిస్తోంది.

Read Also: PIB Fact Check: ఇరాన్ అణు కేంద్రాలపై దాడి.. భారత వైమానిక ప్రాంతాన్ని ఉపయోగించుకున్న అమెరికా..?

అయితే, టెహ్రాన్‌లోని కీలక మిస్సైల్ లాంచర్ స్థావరాన్ని పూర్తిగా ధ్వంసం చేయడమే కాకుండా, కెర్మాన్షా, హమెదాన్ ప్రాంతాల్లోని మిలిటరీ రాడార్ కేంద్రాలపై కూడా ఇజ్రాయెల్ భారీ దాడులకు పాల్పడినట్లు తెలుస్తుంది. ఈ మిస్సైల్ కేంద్రాలు భవిష్యత్తులో తమ దేశాన్ని లక్ష్యంగా చేయడానికే ఉపయోగపడతాయని పేర్కొనింది. గత కొన్ని రోజులుగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య వార్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ దాడులను మితిమీరిన చర్యగా అంతర్జాతీయ సమాజం విమర్శలు గుప్పిస్తుంది. మిడిల్ ఈస్ట్ లో శాంతిని నెలకొల్పాలని, యుద్ధాన్ని ఆపేయాలని ఐక్యరాజ్యసమితి సహా అనేక దేశాలు ఇజ్రాయెల్- ఇరాన్ ను కోరుతున్నాయి. ఇక, ఇరాన్ ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో ప్రతీకార దాడులకు దిగలేదు. తాజా దాడులతో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారాయి.

Exit mobile version