Iran-Israel: ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ.. నేవీ చీఫ్ అలిరెజా హతం
- ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ
- కీలక నేవీ చీఫ్ హతం!
- వెల్లడించిన ఇజ్రాయెల్ మీడియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్‌కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. కీలక నేతలంతా ఒక్కొక్కరిగా నేలరాలిపోతున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ దగ్గర నుంచి ఆయన కుడి భుజం, ఇరాన్ భద్రతా అధిపతి అలీ లారిజానీ వరకు టాప్ మోస్ట్ లీడర్లంతా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ పక్కా ప్రణాళికతో టాప్ లీడర్లందరినీ హతమార్చుతోంది. తాజాగా మరో కీలక నేతను అంతమొందించినట్లుగా ఇజ్రాయెల్ మీడియా తెలిపింది.
ఇరాన్‌లోని బందర్ అబ్బాస్‌పై ఇజ్రాయెల్ భారీ దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్ నేవీ చీఫ్ అలిరెజా తంగ్సిరి ప్రాణాలు తీసింది. ప్రస్తుతం హార్ముజ్ దిగ్బంధనాన్ని అలిరెజా తంగ్సిరినే పర్యవేక్షిస్తున్నాడు. హార్ముజ్ జలసంధి మూసివేతకు అలీరెజానే కారణమని నివేదికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అలిరెజాను ఇజ్రాయెల్ టార్గెట్ చేసుకుని చంపేసింది. అలిరెజా హతం అయినట్లుగా ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది.
Also Read
- Traffic Jam: ప్రపంచంలోనే భారీ ట్రాఫిక్ జామ్.. 97 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.. 12 రోజుల పాటు కదలని ట్రాఫిక్
- US-China Talks: అమెరికా-చైనా ద్వైపాక్షిక చర్చలు పూర్తి.. వైట్‌హౌస్ డిన్నర్లో ట్రంప్-జిన్‌పింగ్
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- XI Jinping: ‘‘ AI మనుషుల కంట్రోల్లోనే ఉండాలి’’.. వైట్‌హౌజ్‌లో జిన్‌పింగ్ పిలుపు..
బందర్ అబ్బాస్‌లో జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నావికాదళ అధిపతి అలీరెజా తంగ్సిరి మరణించినట్లు ఒక ఇజ్రాయెల్ అధికారి పేర్కొన్నట్లుగా ఇజ్రాయెల్ మీడియా తెలిపింది. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదిక ప్రకారం.. హార్ముజ్ జలసంధి మూసివేతకు తంగ్సిరియే బాధ్యుడని పేర్కొంది. అయితే ఈ దాడిపై ఇరాన్ గానీ.. ఇజ్రాయెల్ సైన్యం గానీ ఇంకా అధికారింగా వెల్లడించలేదు.
అలీరెజా తంగ్సిరి..
అలీరెజా తంగ్సిరి.. 2018 నుంచి ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నావికాదళ అధిపతిగా పని చేస్తున్నారు. అలీరెజా తంగ్సిరికి ఆ పదవిలో మంచి అనుభవం ఉంది. ఇజ్రాయెల్, అమెరికా దాడి చేయగానే హార్ముజ్ జలసంధిని మూసేయాలని అలీరెజా ఆదేశాలు ఇచ్చాడు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ సమస్యలు వచ్చాయి. వాస్తవంగా హార్ముజు నుంచి ప్రతిరోజు 120 నౌకలు ప్రయాణం చేస్తాయి. కానీ యుద్ధం ప్రారంభం అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కేవలం 155 నౌకలు మాత్రం ప్రయాణించాయి. దాదాపు 95 శాతం తగ్గిపోయింది. దీనింతటికి అలీరెజానే కారణంగా ఇజ్రాయెల్ భావించింది. ఈ నేపథ్యంలోనే అతడిని చంపేసినట్లుగా ఇజ్రాయెల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. అయతుల్లా ఖమేనీ, లారిజానీ తర్వాత కీలక నేతల్లో అలీరెజా తంగ్సిరి కూడా ఒక ముఖ్యమైన నేత.
తాజావార్తలు
-
Ganesh Immersion: హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు.. MJ మార్కెట్ నుంచి ఖైరతాబాద్ వరకు పటిష్ట బందోబస్తు.!
-
Explainer: రోజురోజుకీ మరింత పవర్‌ఫుల్‌గా మారుతున్న AIతో మనిషి ఉనికికే ముప్పు రానుందా?
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
Kareena – Aiswarya : బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకున్నట్లే?
-
Honor X9e Pro: 11,000mAh బ్యాటరీతో హానర్ X9e ప్రో 5G లాంచ్.. 10,000 నిట్స్ డిస్‌ప్లే, 108MP కెమెరా
ట్రెండింగ్
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!