Israel – Iran War: దుబాయ్, కువైట్, ఖతార్ ఎయిర్ స్పేస్ మూసివేత..

Israel Iran War (1)

Israel Iran War (1)

Israel – Iran War: ఇజ్రాయిల్-ఇరాన్ వార్ భీకరంగా మారుతోంది. ఈ యుద్ధం కేవలం రెండు దేశాలకు మాత్రమే పరిమితం కాకుండా, మొత్తం మిడిల్ ఈస్ట్‌నే అతలాకుతలం చేస్తోంది. ఈ రోజు ఉదయం ఇజ్రాయిల్, ఇరాన్‌పై వైమానిక దాడులు నిర్వహించింది. ‘‘ఆపరేషన్ షీల్డ్ ఆఫ్ జుడా’’ను ఇజ్రాయిల్ ప్రారంభించింది. ఇజ్రాయిల్‌, అమెరికా కలిసి దాడులు చేస్తున్నాయి. ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ లక్ష్యంగా వేట సాగిస్తున్నారు.

Read Also: Israel-Iran War: యూఏఈ, కువైట్, బహ్రైయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ క్షిపణి దాడులు..

ఇదిలా ఉంటే, ఇరాన్ అమెరికా మిత్రదేశాలపై దాడులు చేస్తోంది. మధ్యప్రాచ్యంలోని సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, బహ్రైయిన్, సౌదీ అరేబియా, జోర్డాన్, ఖతార్‌లోని యూఎస్ స్థావరాలపై క్షిపణి దాడులు ప్రారంభించింది. యూఏఈ రాజధాని అబుదాబికి సమీపంలోని అల్-ధఫ్రా (Al-Dhafra) ఎయిర్ బేస్ పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో యూఏఈ తన గగనతలాన్ని పూర్తిగా మూసేసింది. అబుదాబి, దుబాయ్ ఎయిర్ స్పేస్ క్లోజ్ చేసింది. యూఏఈ మాత్రమే కాకుండా ఖతార్, కువైట్ కూడా గగనతలాన్ని మూసేశాయి. ప్రముఖ ఎయిర్ డెస్టినేషన్స్‌గా ఉన్న ఈ దేశాల ఎయిర్ స్పేస్ మూసేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా అన్ని విమానయాన సంస్థలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి.