Israel-Iran War: ఇరాన్ టాప్-లీడర్‌షిప్ ఖతం.. ఖమేనీ సహా 40 మంది కమాండర్లు హతం..

Khameni

Khameni

Israel-Iran War: ఇజ్రాయిల్, అమెరికాలు ఇరాన్‌పై తమ దాడుల్ని తీవ్రం చేశాయి. శనివారం జరిగిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. మరోవైపు, ఇరాన్ పశ్చిమాసియా అంతటా ప్రతీకార దాడులకు చేస్తోంది. ముఖ్యంగా ఇరాన్ తన పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రైయిన్, జోర్డాన్, ఇరాక్ లోని యూఎస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. మిస్సైళ్లు, డ్రోన్ దాడులతో వణికిస్తోంది.

Read Also: Israel-Iran War: ఇరాన్‌ను ముంచిన “చైనా ఆయుధ వ్యవస్థలు”.. మరోసారి ఘోరంగా విఫలం..

ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ టాప్ నాయకత్వం అంతా మరణించినట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ప్రకటించింది. రెండో రోజు ఇరాన్‌ను నిర్వీర్యం చేశామని, దాని రాజకీయ సైనిక నాయకత్వాన్ని పూర్తిగా నాశనం చేసినట్లు చెప్పింది. ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించారు. మొత్తం 40 మంది టాప్ కమాండర్లు హతమైనట్లు ఇజ్రాయిల్ చెబుతోంది.

ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో మరణించిన వారిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ, అతని కుటుంబ సభ్యులతో పాటు రక్షణ మంత్రి అమీర్ నాసిర్జాదే, ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ అబ్దుల్‌రహీం మౌసావి, IRGC కమాండర్-ఇన్-చీఫ్ మొహమ్మద్ పక్‌పూర్, సీనియర్ భద్రతా సలహాదారు అలీ షాంఖానీ, మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ సలాహ్ అస్సాది మరియు సుప్రీం లీడర్ మిలిటరీ బ్యూరో చీఫ్ మొహమ్మద్ షిరాజీ ఉన్నారు. ఇరాన్ పోలీస్ ఇంటెలిజెన్స్ సెంటర్ అధిపతి బ్రిగేడియర్ జనరల్ ఘోలం రెజా రెజాయన్ కూడా మరణించారు.