Site icon NTV Telugu

Israel: హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ హతం..! మీడియాలో జోరుగా ప్రచారం

Hamaschief

Hamaschief

హమాస్ అంతమే లక్ష్యంగా ఇప్పటికే ముఖ్య నాయకులను ఇజ్రాయెల్ దళాలు అంతమొందించాయి. గాజాను పూర్తిగా ధ్వంసం చేసింది. అయితే తాజాగా అక్టోబర్ 17న హమాస్ అధినేత యాహ్యా సిన్హార్‌ను కూడా మట్టుబెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. గత కొద్ది రోజులుగా సిన్హార్ తప్పించుకుని తిరుగుతున్నాడు. తాజా దాడుల్లో ఐడీఎఫ్ దళాలు గురి చూసి దాడి చేసినట్లు కథనాలు వస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Imran Khan: ఆక్స్‌ఫర్డ్ ఛాన్సలర్ రేసు నుంచి ఇమ్రాన్‌ఖాన్ ఔట్.. కారణమిదే!

గురువారం గాజా స్ట్రిప్‌ ప్రాంతంపై ఇజ్రాయెల్‌ దళాలు వైమానిక దాడులు జరిపాయి. ఈ దాడుల్లో ఇద్దరు ఉగ్రవాదుల్ని హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ ఆర్మీ ప్రకటించింది. ఆ ఇద్దరిలో యాహ్యా సిన్వార్‌ ఉన్నాడని, ఆయన ఆచూకీ కోసం అన్వేషిస్తున్నట్లు సమాచారం. గాజా స్ట్రిప్‌లో యాహ్యా సిన్వార్‌ డెడ్‌బాడీ సైతం లభ్యమైనట్లు ఫొటోలు వైరల్‌గా మారాయి. మరోవైపు డీఎన్ టెస్టులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Bangladesh: బంగ్లాదేశ్‌లో పాకిస్తాన్ భావజాలం.. జాతిపిత, స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం ఉన్న జాతీయ సెలవుల రద్దు..

యాహ్యా సిన్వార్‌ ఇప్పటి వరకు వివిధ వేషాలు ధరించి తప్పించుకుని తిరుగుతున్నట్లు తెలుస్తోంది. మహిళల వస్త్రాలు ధరించి తప్పించుకుని తిరగడంతో దాడుల నుంచి బయటపడుతూ వచ్చాడు. అయితే తాజా దాడుల్లో మాత్రం చనిపోయినట్లు సమాచారం. ఇరాన్‌లో హమాస్ అధ్యక్షుడు ఇస్మాయేల్ హనియే హతం అయిన తర్వాత యాహ్యా సిన్వార్ హమాస్ చీఫ్‌గా ఎన్నికయ్యాడు.

ఇది కూడా చదవండి: Minister Nara Lokesh: పెట్టుబడులే లక్ష్యం.. ఈ నెల 25 నుంచి అమెరికాలో మంత్రి నారా లోకేశ్ పర్యటన

Exit mobile version