NTV Telugu Site icon

Israel-Lebanon War: పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు.. హిజ్బుల్లా లాంచర్లను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్

Israellebanonwar

Israellebanonwar

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈసారి లెబనాన్‌లోని హిజ్బుల్లా-ఇజ్రాయెల్ మధ్య వార్ సీరియస్‌గా మారింది. నిన్నా మొన్నటిదాకా హమాస్ లక్ష్యంగా గాజాను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. తాజాగా హిజ్బుల్లా టార్గెట్‌గా ఇజ్రాయెల్ దూసుకెళ్తోంది. గత రెండ్రోజులుగా లెబనాన్ వణికిపోతోంది. కమ్యూనికేషన్ పరికరాలు ఒక్కసారిగా పేలడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది క్షతగాత్రులగా మారారు. కేవలం హిజ్బుల్లా నాయకులే లక్షంగా దాడులు జరిగాయి. మొదటి రోజు పేజర్లు పేలగా… అనంతరం వాకీటాకీలు పేలాయి. దీంతో లెబనాన్ రక్తసిక్తంగా మారింది.

ఇది కూడా చదవండి: India’s wedding industry: నవంబర్, డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా 35 లక్షల వివాహాలు.. ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా..?

తాజాగా హిజ్బుల్లా ప్రతీకార దాడులకు తెగబడింది. హిజ్బుల్లా చీఫ్ ప్రతిజ్ఞ చేసిన కొన్ని గంటల తర్వాత.. ఇజ్రాయెల్‌పై 30 రాకెట్ లాంచర్లను ప్రయోగించింది. అయితే ఈ లాంచర్లను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. అయితే ఆస్తి, ప్రాణ నష్టాలపై మాత్రం ఎలాంటి సమాచారం రాలేదు. ఇజ్రాయెల్‌ వైపు వందలాది లాంచర్లు వచ్చినట్లుగా మీడియా కథనాలు వెలువడుతున్నాయి. దాదాపు 100 రాకెట్లు ప్రయోగించినట్లు వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: కుమార్తెకు పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన బహుమతి

అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి బందీలుగా తీసుకెళ్లిపోయింది. కొందరు బందీలను కూడా చంపేసింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు పాల్పడింది. గాజాను మట్టుబెట్టింది. వందలాది మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. అయితే హమాస్‌కు మద్దతుగా లెబనాన్‌లోని హిజ్బుల్లా గ్రూప్.. ఇజ్రాయెల్‌పై దాడులకు పాల్పడింది. దీంతో తాజాగా హిజ్బుల్లా-ఇజ్రాయెల్ మధ్య వార్ నడుస్తోంది. ఇప్పటికే కమ్యూనికేషన్ పరికరాల పేలుళ్లతో వందిలాది మంది హిజ్బుల్లా నాయకులు ప్రాణాలు కోల్పోయారు. తాజా యుద్ధం ఎటువైపు నడుస్తుందో చూడాలి.

ఇది కూడా చదవండి: Custard Apples : “సీతాఫలం ఎంతో బలం”.. దాన్ని తింటే పలు రోగాలు మాయం!

 

Show comments