ప్రస్తుతం సీతాఫలాల సీజన్.. పల్లెల్లోని పొలాల్లో, గట్లపై దొరికే ఈ ఫలాలానికి సీటీల్లో మంచి డిమాండ్ ఉంది.
దీంట్లో ఫైబర్, విటమిన్స్, ఖనిజాలు పలు రోగాలను దూరం చేస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
సీతాఫలాల్లో పొటాషియం, మెగ్నీషియంలు ఉంటాయి. ఇవి బీపిని కంట్రోల్ చేస్తాయి.
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లుటీన్ కళ్ళలోని యాంటీ ఆక్సిడెంట్స్‌లో ఒకటైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. కంటి ఆరోగ్యం మెరుగవుతుంది.
వీటిలోని విటమిన్ బి6.. మానసిక స్థితిని కంట్రోల్ చేసే సెరోటోనిన్, డోపమైన్, న్యూరో ట్రాన్స్‌మీటర్‌ని రిలీజ్ చేస్తుంది. డిప్రెషన్ దూరమవుతుంది.
ఇమ్యూనిటీని మెరుగుపరిచే విటమిన్ సీ ఈ పండ్లలో ఉంటుంది. దీంతో సీజనల్ వ్యాధులు దూరమవుతాయి.
వీటిని తినడం వల్ల దీర్ఘకాలిక మంట తగ్గి గుండెజబ్బులు సహా పలు సమస్యల్ని తగ్గించుకోవచ్చు.
సీతాఫలాల్లో ఉండే కొన్ని సమ్మేళనాలు.. క్యాన్సర్స్‌కి వ్యతిరేకంగా పోరాడతాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలని తగ్గిస్తాయి.
ఇందులో ఉండే ఫైబర్ మలబద్దకాన్ని తగ్గిస్తుంది. దీంతోపాటు హెల్దీ ప్రేగు కదలికలు, జీర్ణ ఆరోగ్యం మెరుగవుతుంది.
నోట్: నాడీ సమస్యలు, పార్కిన్సన్స్ సమస్యలు ఉంటే ఈ పండ్లు తినకపోవడమే మంచిది. యాబెటిస్ పేషెంట్స్‌కి అంత మంచిది కాదు.