NTV Telugu Site icon

Israel-Hamas War: “హమాస్‌ని కూల్చేస్తాం”.. క్యాబినెట్ అత్యవసర సమావేశంలో ఇజ్రాయిల్ పీఎం

Israel Pm

Israel Pm

Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం భీకరంగా సాగుతోంది. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ లో జరిగిన క్రూరమైన హత్యలకు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) బలగాలు వైమానిక దాడులు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే భూతల దాడులు నిర్వహించేందుకు సైన్యం సిద్ధమైంది. పాలస్తీనా ప్రజలు గాజా ఉత్తర ప్రాంతాన్ని వదిలి వెళ్లాలని ఇప్పటికే ఐడీఎఫ్ హెచ్చరించింది.

ఇదిలా ఉంటే ఇజ్రాయిల క్యాబినెట్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ అధ్యక్షతన అత్యవసరంగా భేటీ అయింది. ప్రతిపక్ష పార్టీ నేత బెన్నీ గాంట్జ్ ఇటీవల ప్రభుత్వంలో చేరారు. ఉమ్మడి ప్రభుత్వ తొలి సమావేశం ఆదివారం జరిగింది. హమాస్‌ని కూల్చేస్తామని ఈ సమావేశంలో నెతన్యాహు ప్రకటించారు. ఈ వీడియోను పీఎం కార్యాలయం షేర్ చేసింది.

Read Also: Chandrayaan-3: భారత టెక్నాలజీని అమెరికా కోరింది.. ఇస్రో చీఫ్ కీలక వ్యాఖ్యలు..

ఇదిలా ఉంటే గాజా ప్రాంతాన్ని చుట్టుముట్టిన ఇజ్రాయిల్ ఆర్మీ, భూతల దాడుల కోసం రాజకీయ నిర్ణయం కోసం వేచి చూస్తున్నాయి. ఇప్పటికే ఉత్తర గాజాలోని 10 లక్షల మంది ప్రజలు దక్షిణానికి వెళ్లాల్సిందిగా సైన్యం చెప్పింది. ప్రజలకు ఇచ్చిన డెడ్‌లైన్ కూడా అయిపోవడంతో ఇక దాడికి అంతా సిద్ధం చేసుకుంటోంది ఇజ్రాయిల్ ఆర్మీ. తాము రాజకీయ నాయకత్వంతో చర్చలు జరుపుతున్నామని సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ రిచర్డ్ హెచ్జ్ అన్నారు.

ఇప్పటికే గాజా చుట్టూ 10 మంది సైన్యాన్ని మోహరించింది ఇజ్రాయిల్. సైనిక సామాగ్రిని సిద్ధం చేసుకుంది. శనివారం ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ పదాతిదళాల సైనికులను కలిసి రెండో దశకు సిద్ధంగా ఉన్నారా..? అంటూ భూతల దాడులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్ సైనికులు గాజా నగరంలో పాటు ఉత్తర గాజాలోని అన్ని ప్రాంతాల్లోకి వెళ్లి హమాస్ తీవ్రవాదులను మట్టుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అక్టోబర్ 7 నాటి దాడులకు ప్రధాన సూత్రధారి హమాస్ కీలక నేత యాహ్య సిన్వార్ గా గుర్తించింది ఇజ్రాయిల్. అతను మా దృష్టిలో ఉన్నాడంటూ ఇజ్రాయిల్ వార్నింగ్ ఇచ్చింది.. అతడిని చంపేదాక విశ్రమించబోమని చెప్పింది.