NTV Telugu Site icon

Israel-Hamas: ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య శాంతి చర్చలు.. త్వరలోనే కాల్పుల విరమణ

Hamas

Hamas

Israel-Hamas: ఇజ్రాయెల్‌, హమాస్‌ల సుదీర్ఘంగా కొనసాగుతున్న యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణ దిశగా అడుగులు పడుతున్నాయి. గాజాలో కాల్పుల విరమణ ఒప్పంద చర్చల్లో తమ స్పై చీఫ్‌ పాల్గొంటున్నారని ఇప్పటికే ఇజ్రాయెల్‌ ప్రకటించింది. మరోవైపు ఒప్పందం కుదిరితే పోరాటం ఆపేస్తామని హమాస్‌ వర్గాలు సైతం తెలిపాయి.

Read Also: Swag : సర్ ప్రైజ్.. ఓటీటీలోకి వచ్చేసిన శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ స్వాగ్.. ఎక్కడ చూడాలంటే

ఇక, దోహాకు చెందిన ఓ అధికార ప్రతినిధి బృందం కైరోలో ఈజిప్టు అధికారులతో గాజా సంధికి సంబంధించిన ప్రతిపాదనలపై చర్చలు జరుపుతున్నట్లు హమాస్‌కు చెందిన ఓ సీనియర్‌ అధికారి మీడియాకు వెల్లడించారు. హమాస్‌ పోరాటాన్ని ఆపడానికి సిద్ధంగా ఉంది.. అయితే, ఇజ్రాయెల్‌ కాల్పుల విరమణకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. యుద్ధం వల్ల గాజా నుంచి వెళ్లిపోయిన వారిని తిరిగి అనుమతించాలన్నారు. ఖైదీల మార్పిడి ఒప్పందాన్ని అంగీకరించడంతో పాటు గాజాకు అందే మానవతా సాయానికి అడ్డు తొలగాలని హమాస్ సీనియర్ నేత చెప్పారు.

Read Also: Cyclone Dana: తీరం దాటిన దానా తీవ్ర తుఫాన్.. ఉత్తరాంధ్రకు హెచ్చరికలు

కాగా, బందీలను రిలీజ్ చేసేందుకు ఒప్పందం చేసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. కైరో మీటింగ్ తర్వాత ఇజ్రాయెల్‌కు చెందిన మొస్సాద్‌ గూఢాచార సంస్థ అధిపతిని అజెండాలోని ముఖ్యమైన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఖతార్‌కు వెళ్లాలని ప్రధాని కార్యాలయం ఆదేశించినట్లు తెలిపింది. అయితే, గతేడాది అక్టోబరు 7వ తేదీన హమాస్‌ దాడులకు ప్రధాన సూత్రధారి అయిన యాహ్యా సిన్వర్‌ ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన దాడిలో చనిపోయాడు. ఈ క్రమంలోనే సిన్వర్‌ మరణం ఓ ఒప్పందానికి దారి తీస్తుందని ఆమెరికా పేర్కొనింది.