NTV Telugu Site icon

Ayatollah Ali Khamenei: ఇరాన్ సుప్రీంలీడర్‌కి తీవ్ర అస్వస్థత.. ఇజ్రాయిల్ దాడి తర్వాత కీలక విషయం..

Ayatollah Ali Khamenei

Ayatollah Ali Khamenei

Ayatollah Ali Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ అస్వస్థతకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. శనివారం ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ది న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, ఖమేనీ రెండవ పెద్ద కుమారుడు, మోజ్తాబా ఖమేనీ (55) అతని తర్వాత సుప్రీంలీడర్‌గా ఎన్నికలయ్యే అవకాశం కనిపిస్తోంది. 85 ఏళ్ల ఖమేనీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ఫ్ కూడా అతడి తర్వాత దేశ బాధ్యతలు తీసుకుంటారనే దానిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Read Also: Rajnath Singh: చైనా సరిహద్దుల్లో.. ఆర్మీతో కలిసి రాజ్‌నాథ్ దీపావళి వేడుకలు..

రెహెల్లా ఖమేనీ మరణించిన తర్వాత 1989 నుంచి అయతొల్లా ఖమేనీ ఇరాన్ అత్యున్నత నాయకుడిగా ఉన్నారు. ఈ ఏడాది ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత వారసత్వంపై ఆందోళనలు నెలకొన్నాయి. రైసీ మరణించిన నుంచి వారసత్వంపై అంతర్గత పోరు నడుస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, అక్టోబర్ 01న ఇజ్రాయిల్‌పై ఇరాన్ దాడులుకు ప్రతిగా శనివారం ఇరాన్‌లోని నిర్దిష్ట లక్ష్యాలపై ఇజ్రాయిల్ దాడులు చేసింది. ఏకంగా వందకు పైగా ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్లు ఈ దాడుల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ దాడికి తప్పకుండా ప్రతీకారం ఉంటుందని మరోవైపు ఇరాన్ హెచ్చరించింది.

Show comments