NTV Telugu Site icon

Iran: ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ కమాండర్ మిస్సింగ్.. ఇజ్రాయిల్ దాడుల్లో హతం..

Esmail Qaani

Esmail Qaani

Iran: ఇరాన్‌కి చెందిన రివల్యూషనరీ గార్డ్స్ కార్ఫ్స్(IRGC) ఖుద్స్ ఫోర్స్ కమాండర్ ఎస్మాయిల్ ఖానీ శుక్రవారం బీరుట్‌లో కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. శుక్రవారం బీరూట్‌పై జరిగిన ఇజ్రాయిల్ వైమానిక దాడుల తర్వాత నుంచి మిస్సయినట్లు నివేదికలు వెలువడ్డాయి. ఇరాన్ మీడియా ఇతడి ఆచూకీ గురించి మౌనంగా ఉండగా.. టర్కీష్, ఇజ్రాయిల్ మీడియాలు మాత్రం ఖానీ చనిపోయి ఉండొచ్చని పేర్కొన్నాయి.

లెబనాన్ రాజధాని బీరూట్ దక్షిణ శివారు ప్రాంతమైన దహియేహ్‌లో ఇజ్రాయిల్ వైమానిక దాడులు హిజ్బుల్లా కొత్త చీఫ్, చనిపోయిన నస్రల్లా వారసుడిగా చెప్పబడుతున్న హషీమ్ సఫిద్దీన్‌ని లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడుల తర్వాత సఫీద్దీన్ కూడా అందుబాటులో లేనట్లు తెలిసింది. ఇతను చనిపోయి ఉంటాడని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు నివేదించాయి.

Read Also: Uttar Pradesh: ‘‘బిస్లరీ’’కి బదులుగా కలెక్టర్‌కి ‘‘బిల్సెరీ’’ వాటర్ బాటిల్.. బుల్డోజర్ యాక్షన్ షురూ..

ఇజ్రాయిలీ మీడియా ప్రకారం.. ఇరాన్ బ్రిగేడియర్ ఖానీ ఆ సమయంలో దహియేహ్‌లోనే ఉన్నాడని పేర్కొంటున్నాయి. ఇరాన్ కమాండర్ మరణానికి సంబంధించి ఇజ్రాయిల్ ఆర్మీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, లెబనీస్ అధికారులు మాత్రం ఖానీ మరణాన్ని ధృవీకరించారని ఇజ్రాయిల్ వార్తా సంస్థ ఛానెల్ 12 పేర్కొంది. ఇదిలా ఉంటే, ఇతను ఇజ్రాయిల్ మోసాద్‌కి సహకరిస్తున్నాడని ఇరాన్ ఉరితీసి ఉండొచ్చని కొన్ని సౌదీ వార్తా ఛానెళ్లు చెబుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ శుక్రవారం ప్రార్థనల సమయంలో ఖానీ గైర్హాజరయ్యాడు.

ఇస్మాయిల్ ఖానీ ఎవరు..?

గతంలో ఖుద్స్ ఫోర్స్ చీఫ్‌గా ఉన్న ఖాసిమ్ సులేమానిని 2020లో ఇరాక్ రాజధాని బాగ్దాద్ ఏయిర్‌పోర్టులో అమెరికా డ్రోన్ దాడిలో హతం చేసింది. సులేమానీ హత్య తర్వాత, ఇరాక్ సైనిక వ్యూహాన్ని రూపొందించడంలో ఖానీ కీలక పాత్ర పోషించాడు. ఖుద్స్ ఫోర్స్ బాధ్యతలు తీసుకునే ముందు ఖానీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగంలో విధులు నిర్వహించాడు.

Show comments