Iran Peace Proposal: ఇరాన్ 14-సూత్రాల ప్రతిపాదన.. అమెరికాకు 30 రోజుల అల్టిమేటం
- ఇరాన్, అమెరికాకు 14 సూత్రాల శాంతి ప్రతిపాదన
- అమెరికాకు 30 రోజుల అల్టిమేటం
- శాశ్వత శాంతిపైనే టెహ్రాన్ దృష్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలను తగ్గించడం, కీలక వ్యూహాత్మక సముద్ర మార్గమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం కోసం ఇరాన్, అమెరికాకు 14 సూత్రాల శాంతి ప్రతిపాదనను పంపింది. తన దౌత్య ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం, పాకిస్తాన్ ద్వారా వాషింగ్టన్కు పంపిన ఈ ప్రతిపాదనలో లెబనాన్‌తో సహా అన్ని రంగాల్లో యుద్ధాన్ని ముగించాలని కోరింది. అమెరికా రెండు నెలల కాల్పుల విరమణను సమర్థిస్తుండగా, ఇరాన్ 30 రోజుల్లోగా ఒక పరిష్కారానికి రావాలని స్పష్టం చేసింది. కేవలం కాల్పుల విరమణను పొడిగించడం కాకుండా, శాశ్వత శాంతిపైనే టెహ్రాన్ దృష్టి సారిస్తోంది.
అయితే ఈ ప్రతిపాదనతో తాను మొదట్లో సంతృప్తి చెందలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. ప్రతిపాదనను సమీక్షిస్తున్నప్పటికీ, ఇరాన్ ఇంకా పూర్తి మూల్యం చెల్లించనందున దాన్ని అంగీకరించడం కష్టమని తెలిపారు.ఇరాన్ దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, సైనిక ప్రత్యామ్నాయాలు సిద్ధంగా ఉన్నాయని ట్రంప్ హెచ్చరించారు. ప్రాంతీయ పరిస్థితి మరింత పెళుసుగా మారింది. ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణ బలహీనపడుతోంది. దక్షిణ లెబనాన్‌లోని 11 పట్టణాలు, గ్రామాల నివాసులను ఒక కిలోమీటరు వెనక్కి వెళ్లాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది.
Also Read
- Israel: ఇజ్రాయెల్-వియన్నా విమానానికి బాంబ్ బెదిరింపు.. ఎమర్జెన్సీ కోడ్‌తో అలర్ట్
- Donald Trump: ఫ్రాన్స్‌లో అల్లర్లు.. వలసదారులే కారణమన్న ట్రంప్, ‘సరిహద్దులు మూసేయండి’ అంటూ పిలుపు!
- Kilauea volcano: 55వ సారి కిలావుయా అగ్ని పర్వత విస్పోటనం..
- Pakistan Airspace Ban: భారత విమానాలపై పాకిస్తాన్ ఆంక్షలు.. గగనతల నిషేధం పొడిగింపు..
ఇరాన్ కీలక డిమాండ్లు
ఏఎన్ఐ ప్రకారం, అమెరికా తొమ్మిది సూత్రాల ప్రణాళికకు ప్రతిస్పందనగా ఇరాన్ కింది డిమాండ్లను ముందుకు తెచ్చింది
సైనిక దాడి హామీని రద్దు చేయడం
ఆ ప్రాంతం నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకోవడం
స్తంభింపజేసిన ఆస్తులను విడుదల చేయడం
ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయడం
హార్ముజ్ జలసంధిలో రాకపోకల కోసం కొత్త యంత్రాంగాన్ని కూడా ప్రతిపాదించింది. దీనిని శాశ్వత పరిష్కారం దిశగా ఒక అడుగుగా అభివర్ణిస్తూ, ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ గరీబాబాది “ఇప్పుడు దౌత్యం లేదా ఘర్షణ, నిర్ణయం అమెరికా తీసుకోవాలి” అని అన్నారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డు ఇంటెలిజెన్స్ యూనిట్ మరింత తీవ్రంగా వ్యాఖ్యానించింది. “అసాధ్యమైన యుద్ధం, నష్టదాయకమైన ఒప్పందం.. రెండింటిలో ఒకటి ఎంచుకోవాలి అమెరికా.”ఇరు దేశాల మధ్య అతిపెద్ద విభేదం ఇరాన్ అణు కార్యక్రమంపైనే ఉందని వర్గాలు తెలిపాయి.
అమెరికా స్పష్టమైన హామీలు కోరుతుండగా, ఇరాన్ ముందుగా ఆంక్షల సడలింపును డిమాండ్ చేస్తోంది. హార్ముజ్ జలసంధి విషయంలో యుద్ధానికి ముందున్న యథాతథ స్థితికి తిరిగి వెళ్లడానికి తాము సుముఖంగా లేమని ఇరాన్ స్పష్టం చేసింది. “హార్ముజ్ ఇరాన్‌కు చెందినది. ఇతర దేశాల నౌకలు సుంకం చెల్లించి ప్రయాణించవచ్చు. కానీ అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకు ప్రవేశం ఉండదు” అని ఇరాన్ పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ అలీ నిక్జాద్ పేర్కొన్నారు.
ట్రంప్ ‘సముద్రపు దొంగతనం’ వ్యాఖ్యపై ఇరాన్ ఆగ్రహం
రాయిటర్స్ ప్రకారం, ఇరాన్ నౌకలను స్వాధీనం చేసుకోవడాన్ని “సముద్రపు దొంగతనం”గా అభివర్ణించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇది కేవలం మాట జారడం కాదని, అంతర్జాతీయ సముద్ర చట్టాన్ని ఉల్లంఘించినట్లు బహిరంగంగా అంగీకరించడమేనని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయీ అన్నారు. ఈ ప్రవర్తన ప్రపంచ సముద్ర నియమాలకు తీవ్ర ముప్పును కలిగిస్తుందని, దీన్ని సాధారణీకరించకూడదని ఆయన Xలో పోస్ట్ చేశారు. ఇటువంటి ఉల్లంఘనలను గట్టిగా తిరస్కరించాలని ఐక్యరాజ్యసమితి, దాని సభ్య దేశాలు, సెక్రటరీ జనరల్‌కు విజ్ఞప్తి చేశారు.
ఫ్లోరిడాలో జరిగిన ఒక కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ, ఇరాన్ ఓడరేవుల దిగ్బంధన సమయంలో అమెరికా నౌకాదళం “సముద్రపు దొంగల్లా” ప్రవర్తించిందని, ఆ ఓడ, సరుకు, చమురును స్వాధీనం చేసుకోవడం “చాలా లాభదాయకం” అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Shafali Verma: రాత్రంతా నిద్రపోలేదు.. దాని గురించే ఆలోచించా.. షఫాలీ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bollywood: రోహిత్, రణ్వీర్, టైగర్ ష్రాఫ్.. బాలీవుడ్లో మళ్లీ అండర్‌వరల్డ్ నీడలు.. దడ పుట్టిస్తున్న బిష్ణోయ్ గ్యాంగ్..
-
CJP 2.0: సీజేపీ నెక్స్ట్ మూవ్ ఏంటి..? అభిజీత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు..
-
Israel: ఇజ్రాయెల్-వియన్నా విమానానికి బాంబ్ బెదిరింపు.. ఎమర్జెన్సీ కోడ్‌తో అలర్ట్
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!