Submarine attack: శ్రీలంక దక్షిణ తీరంలో ఇరానియన్ నౌకపై జలాంతర్గామి దాడి జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడిలో కనీసం 101 మంది గల్లంతయ్యారని, 78 మంది గాయపడినట్లు శ్రీలంక నేవీ, రక్షణ మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలియజేసింది. శ్రీలంక జలాల్లో ఈ సంఘటన జరిగింది. ప్రమాదానికి గురైన నౌక నుంచి ప్రమాద హెచ్చరికలు రావడంతో శ్రీలంకన్ సైన్యం పెద్ద ఎత్తున సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. చాలా మంది తప్పిపోయినట్లు, గాయాలపాలైనట్లు శ్రీలంక సైన్యం నిర్ధారించింది.
Read Also: F-15 Shot Down: యూఎస్ F-15 యుద్ధవిమానాలు ఎలా కుప్పకూలాయో తెలిసింది.
ఇరాన్ నౌక నుంచి ఎమర్జెన్సీ సిగ్నల్ వచ్చిన వెంటనే శ్రీలంక నేవీ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. గాయపడిన 32 మందిని నేవీ రక్షించినట్లు, వారిని ఆస్పత్రిలో చేర్చినట్లు శ్రీలంక సైన్యం తెలియజేసింది. మునిగిపోతున్న నౌకలోని సిబ్బందిని వైద్య సంరక్షణ కోసం ఒడ్డుకు తరలించినట్లు విదేశాంగ మంత్రి విజిత్ హెరాత్ చెప్పారు. 180 మందితో కూడిన ఐరిస్ దేనా అనే నౌక ప్రమాదంలో ఉందని శ్రీలంక నావికాదళానికి సమాచారం అందిందని, సాయం కోసం నౌకల్ని, విమానాలను పంపించామని ఆయన శ్రీలంక పార్లమెంట్‌లో తెలిపారు.
