Site icon NTV Telugu

Trump-Iran: అప్పుడు బుల్లెట్ గురి తప్పింది.. ఈసారి తప్పదు.. ట్రంప్‌కు హత్యా బెదిరింపులు

Trump5

Trump5

ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలకు దిగబోతుందున్న వార్తల నేపథ్యంలో ట్రంప్ హత్యా బెదిరింపులను ఇరాన్ టీవీ ప్రసారం చేసింది. ‘‘అప్పుడు బుల్లెట్ మిస్ అయింది.. ఈసారి గురి తప్పదు’’ అంటూ ఇరాన్ టీవీ బహిరంగంగా ప్రసారం చేసింది. అంటే అమెరికా దాడికి దిగితే.. ప్రతి దాడి ఉంటుందని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది.

2024లో ఒక ప్రచార ర్యాలీలో జరిగిన హత్యాయత్నం చిత్రాలను తాజాగా ఇరాన్ మీడియాలో ప్రసారం చేస్తోంది. ఒకవేళ ఇరాన్‌కు ఏదైనా జరిగితే ట్రంప్‌కు ప్రత్యక్ష ముప్పు ఉంటుందని ఇరాన్ రాష్ట్ర టెలివిజన్ వార్నింగ్ ఇచ్చింది. ఈసారైతే బుల్లెట్ గురి తప్పదని సూచించింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్నాయి.

ప్రస్తుతం గగనతలాన్ని ఇరాన్ మూసేసింది. అన్ని ఎయిర్‌‌పోర్టులను క్లోజ్ చేసేసింది. దీంతో ఆయా దేశాలకు చెందిన విమాన రాకపోకలు నిలిచిపోయాయి. భారతదేశానికి చెందిన ఎయిరిండియా విమాన రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులకు ఈ మేరకు సూచన జారీ చేసింది. విమాన రాకపోకల్లో అంతరాయం ఉంటుందని తెలియజేసింది.

ఇది కూడా చదవండి: Iran-US: ఇరాన్‌లో కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. దూసుకెళ్తోన్న యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌక

ప్రస్తుతం యూఎస్ఎస్ అబ్రహం లింకన్ పేరు గల అతి పెద్ద నౌక ఇరాన్ వైపు దూసుకెళ్తోంది. ఇది పూర్తి అణు శక్తితో నడిచే అది పెద్ద వాహన నౌక. కాలిఫోర్నియాలోని నాసా నార్త్ ఐలాండ్‌లో దీని ప్రధాన స్థానం. ఇందులో సూపర్ క్యారియర్, 3-6 డిస్ట్రాయర్లు /క్రూయిజర్లు, 1-2 జలాంతర్గాములు, 7,000-8,000 మంది సైనికులు, 65-70 విమానాలు (F-35, F/A 18 ఉన్నాయి.) వందలాది టోమాహాక్ క్షిపణులు ఉంటాయి. ఇది ఇరాన్ వైమానిక స్థావరాలు, నౌకాదళం, చమురు సౌకర్యాలను దెబ్బతీయగలవు. అంతేకాకుండా అణు స్థావరాలను పూర్తిగా దెబ్బతీయగల సామర్థ్యం దీని సొంతం.

ఇది కూడా చదవండి: Silver Rates: సిల్వర్ దూకుడు.. సంక్రాంతికి కూడా తగ్గేదేలే అంటున్న వెండి

Exit mobile version