Site icon NTV Telugu

Iran Video: ‘‘ఖమేనీ డెత్’’ అంటూ నోరు జారిన రిపోర్టర్.. టీవీ ఛానల్స్ సిబ్బంది తొలగింపు

Iran

Iran

ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఉన్నాయి. రెండు దేశాలు కవ్వింపులకు దిగుతున్నాయి. ఏ క్షణంలోనైనా అమెరికా దాడి చేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌లో టెన్షన్.. టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ దేశ విడిచి పారిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ స్టేట్ టీవీ రిపోర్టర్ నోరు జారాడు. ఏకంగా ‘‘ఖమేనీ డెత్’’ అంటూ సంబోధించాడు. ఉద్యోగ టెన్షన్‌లోనో.. లేదంటే కారణం ఏదో తెలియదు గానీ పొరపాటు దొరిల్లింది దీంతో రిపోర్టర్‌తో పాటు టీవీ డైరెక్టర్, మరికొందరు సిబ్బంది ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు.

బుధవారం ఇస్లామిక్ విప్లవం 47వ వార్షికోత్సవం జరిగింది. ఆగ్నేయ ఇరానియన్ నగరమైన జహెదాన్‌లో 1979 ఇస్లామిక్ విప్లవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఇరాన్ రాష్ట్ర టీవీ రిపోర్టర్ ప్రత్యక్ష ప్రసారంలో మాట్లాడుతున్నాడు. ఇంతలో ‘‘ఖమేనీ డెత్’’ అంటూ సంబోధించాడు. ఈ మాట చాలా వేగంగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. దీంతో పొరపాటున నాలుక జారిందని రిపోర్టర్ ముసాబ్ రసౌలిజాద్ క్షమాపణ చెప్పాడు. అయినా కూడా ప్రభుత్వం చర్యలకు పూనుకుంది.

 

Exit mobile version