Iran-Israel War: ఇరాన్లో భారీ నష్టం.. మిలటరీ చీఫ్ సహా అగ్ర నేతలంతా మృతి
- ఇరాన్లో భారీ నష్టం
- మిలటరీ చీఫ్ సహా అగ్ర నేతలంతా మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ భారీ నష్టాన్ని చవిచూసింది. ఇరాన్లో అత్యున్నత సైనికాధికారి మొహమ్మద్ బాఘేరి దుర్మరణం చెందారు. ఈ మేరకు ఇరాన్ మీడియా ధృవీకరించింది. ఇప్పటికే ఇరాన్లో అత్యంత శక్తివంతమైన రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హుస్సేన్ సలామి కూడా మరణించారు. ఐఆర్జీసీ హెడ్‌క్వార్టర్స్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మేజర్ జనరల్ హుస్సేన్ సలామితో పాటు రెవల్యూషనరీ గార్డ్‌లోని ఇతర ముఖ్య అధికారులు, ఇద్దరు అణు శాస్త్రవేత్తలు కూడా మరణించారు. ఈ మేరకు ఇరాన్ మీడియా తెలిపింది. అంతేకాకుండా ఐడీఎఫ్ కూడా ధృవీకరించింది.
ఇది కూడా చదవండి: Iran-Israel War: భారత్ అప్రమత్తం.. పౌరులు జాగ్రత్తగా ఉండాలని సూచన
Also Read
- Trump-Iran: ఈ వారాంతంలో ఇరాన్‌పై భారీ దాడి జరగనుందా? వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం
- US Passport Ranking: అగ్రరాజ్యానికి ఊహించని దెబ్బ.. యూఎస్ పాస్‌పోర్ట్ పవర్ తగ్గిందా? భారత్ ర్యాంక్ చూస్తే ఆశ్చర్యపోతారు!
- Pakistan: పక్క దేశంలో అసలేం జరుగుతోంది? పాకిస్థాన్‌లో పాలకులకు ఆర్మీతో పడట్లేదా?
- Trump Immigration: ట్రంప్ ఎఫెక్ట్.. అమెరికా నుంచి ఇప్పటి వరకు ఎంత మంది భారతీయులు బహిష్కరణకు గురయ్యారంటే!
శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. పెద్ద ఎత్తున పొగలు ఎగిసిపడ్డ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన ముఖ్యనేతలంతా చనిపోయినట్లుగా సమాచారం.
ఇది కూడా చదవండి: PM Modi: అహ్మదాబాద్‌లో విమాన ప్రమాద స్థలిని పరిశీలించిన మోడీ
ఇక బాఘేరి టెహ్రాన్‌లో జన్మించారు. 2016 నుంచి ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ యొక్క సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేస్తున్నారు. ఇది దేశంలో అత్యున్నత సైనిక పదవి. మిలిటరీ ఇంటెలిజెన్స్‌లో నిపుణుడు. 1980లో ఐఆర్జీసీలో చేరి ఇరాన్-ఇరాక్ యుద్ధంలో పోరాడారు. పొలిటికల్ జియోగ్రఫీలో ఆయన పీహెచ్డీ చేశారు. జనరల్ స్టాఫ్‌లో ఇంటెలిజెన్స్ మరియు ఆపరేషన్ల కోసం డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఉన్న బాఘేరి జూన్ 28, 2016న సాయుధ దళాల జనరల్ స్టాఫ్ (AFGS) కొత్త ఛైర్మన్‌గా పదోన్నతి పొందారు. ఇరవై ఏడు సంవత్సరాలు ఆ పదవిలో ఉన్న హసన్ ఫిరోజబాది స్థానంలో ఆయన నియమితులయ్యారు. ఇక బాఘేరి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అమెరికా, కెనడా, యూకే, ఐరోపా సమాఖ్య ఆయనపై ఆంక్షలను విధించాయి.

తాజావార్తలు
-
SRSP Project Update: ఎస్సారెస్పీపై ఉత్తమ్ కీలక ప్రకటన.. రైతులకు గుడ్‌న్యూస్.?
-
Local Elections In AP: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్డేట్.. ఆగస్టు 6న సమావేశం..
-
Kulgam: కుల్గామ్‌లో పహల్గామ్ సీన్ రిపీట్.. హిందువులు లక్ష్యంగా ఉగ్ర దాడి!
-
Anupama: బ్యాడ్ డేస్ ని అసలు మాటల్లో చెప్పలేను!
-
Godavari River: ఉధృతంగా గోదావరి ప్రవాహం.. ఆ తీరప్రాంత వాసుల్లో భయాందోళనలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!