Site icon NTV Telugu

Iran vs America: ట్రంప్ కి ఖమేనీ వార్నింగ్.. ఓవర్ చేస్తే ఇజ్రాయిల్పై దాడి చేస్తాం

Trump

Trump

Iran vs America: ఇరాన్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలకు ఇరాన్ ఘాటుగా స్పందించింది. తమ దేశంపై యూఎస్ సైనిక జోక్యానికి దిగితే, ఈ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు, ఇజ్రాయెల్ లక్ష్యంగా దాడులు చేస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ వార్నాంగ్ ఇచ్చారు.

Read Also: Low Birth Weight Babies: తక్కువ బరువుతో పుట్టిన బిడ్డలు త్వరగా కోలుకునే రహస్యం!

అయితే, ఆందోళనకారులకు ఏదైనా జరిగితే రంగంలోకి దిగుతామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడంతో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ట్రంప్ పేరును ప్రస్తావించకుండా ఓ కార్టూన్‌ను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు. అహంకారం, గర్వం తలకెక్కి ఈ ప్రపంచాన్నే శాసించాలని అనుకుంటున్నాడంటూ ఆ పోస్ట్ లో తెలిపారు. అమెరికా తమపై దాడి చేస్తే ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు. ఇజ్రాయెల్‌ను ఒక దేశంగా ఇరాన్ గుర్తించదని, పాలస్తీనా నుంచి ఆక్రమించుకున్న భూభాగంగా మాత్రమే పరిగణిస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇరాన్ అమెరికా, ఇజ్రాయెల్‌లతో ఆర్థిక, మేధో, సైనిక, ఉగ్రవాద రంగాల్లో పోరాడుతోందని ఖమేనీ పేర్కొన్నారు.ఇరాన్ తాజా హెచ్చరికలతో ఇజ్రాయెల్ అప్రమత్తం అయింది.

Exit mobile version