Iran War: ఇరాన్ యుద్ధంపై మొసాద్ సంచలన రిపోర్ట్..!
- ఇరాన్ యుద్ధంపై మొసాద్ సంచలన రిపోర్ట్..
- యుద్ధం ఏడాది పాటు కొనసాగుతుందని అంచనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran War: మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న ఇరాన్ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. అయితే, ఇదే విషయాన్ని ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొసాద్ ముందుగానే చెప్పనట్లు తెలుస్తోంది. మొసాద్ ముందుగానే ఇజ్రాయిల్ ప్రభుత్వానికి, ప్రధాని నెతన్యాహూకు చెప్పినట్లు సమాచారం. ఈ యుద్ధం ప్రారంభం కావడానికి ముందు మొసాద్ అధిపతి డేవిడ్ బార్నియా.. ఇరాన్‌లో పాలనా మార్పు సాధ్యమేనని కానీ దానికి సమయం పడుతుందని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ మొత్తం ప్రక్రియ, యుద్ధం వారాలు నెలలు కాకుండా ఏడాది పాటు సాగొచ్చని ఆయన అంచనా వేశారు.
Read Also: Chicken Shops Closed: మాంస ప్రియులకు బిగ్ షాక్.. చికెన్ షాపులు బంద్.. ఎప్పటినంచంటే..
Also Read
- Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
బార్నియా ఇజ్రాయిల్ క్యాబినెట్ ముందు యుద్ధానికి సంబంధించిన నివేదికను సమర్పించారు. దీంట్లోనే యుద్ధం ఒక ఏడాది పాటు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. యుద్ధానికి ముందు ఇరాన్‌లో కొన్ని రోజుల్లోనే ప్రజా తిరుగుబాటు జరిగి ఖమేనీ మత పాలన పడిపోతుందని అంతా భావించారు. కానీ ఇరాన్ తిరిగి దాడులు చేస్తుండటంతో ఇజ్రాయిల్, యూఎస్‌కు పాలుపోవడం లేదు. మూడు వారాల్లో ఇరాన్ బలహీనపడినప్పటికీ, ఇప్పటికీ గట్టి నియంత్రణలో దాడి చేసే స్థితిలో ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.
నిజానికి ఇరాన్‌లో పాలనా మార్పు అంత సులభం కాదని అగ్రరాజ్యానికి తెలిసొచ్చింది. అమెరికా గూఢచార అధిపతి తులసి గబ్బార్డ్ మాట్లాడుతూ.. ఇరాన్ ప్రభుత్వం బలహీనపడింది కానీ ఇంకా ఉందని అన్నారు. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మాట్లాడుతూ.. ఇరాన్ ప్రభుత్వం కూలిపోతుందని ఖచ్చితంగా చెప్పలేమని, పరిస్థితిని మార్చడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. మొసాద్ చెప్పినట్లు యుద్ధం ఏడాది పాటు కొనసాగితే, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, చమురు సంక్షోభాలు తప్పవు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్‌డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?