Site icon NTV Telugu

Iran War: ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూను వెంటాడి చంపుతాం.. ఇరాన్ వార్నింగ్..

Netanyahu

Netanyahu

Iran War: ఇరాన్ యుద్ధం రోజు రోజుకు తీవ్రమవుతోంది. యుద్ధం ప్రారంభమై 16 రోజులకు చేరింది. ఇజ్రాయిల్, అమెరికా ఇరాన్‌పై దాడులు చేసిన తొలిరోజే ఆ దేశ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీని చంపేశారు. దీంతో ఇరాన్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను చంపేస్తామని ఇరాన్ ఆదివారం ప్రతిజ్ఞ చేసింది. ‘‘ఈ పిల్లలను చంపే నేరస్థుడు బతికే ఉంటే, మేము అతనిని పూర్తి శక్తితో వెంబడించి చంపుతూనే ఉంటాము’’ అని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్‌లు ఒక ప్రకటనలో తెలిపారు. ఇజ్రాయిల్ ఇరాన్‌పై జరిపిన దాడుల్లో 160 మందికి పైగా స్కూల్ స్టూడెంట్స్ చనిపోయారు. మినాబ్ నగరంలోని స్కూల్‌పై జరగడంతో ఈ దుర్ఘటన జరిగింది.

Read Also: Trump: ‘‘సరదాగా మళ్లీ దాడులు చేయవచ్చు’’.. ఖార్గ్ ద్వీపంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..

నెతన్యాహూ ఎక్కడ ఉన్నాడు, ఆయన మరణించారా? అని సోషల్ మీడియాలో అనుమానాలు వస్తున్న తరుణంలో ఇరాన్ నుంచి ఈ ప్రకటన వచ్చింది. ఇటీవల నెతన్యాహూకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో నెతన్యాహూ చేతికి ఆరు వేళ్లు ఉన్నట్లు కనిపించింది. దీంతో ఈ వీడియోను ఏఐతో ఎడిట్ చేశారని, నెతన్యాహూ చనిపోయారంటూ వార్తలు వచ్చాయి. అయితే, తమ నాయకుడు బతికే ఉన్నాడని ఇజ్రాయిల్ స్పష్టం చేసింది. నెతన్యాహూపై వస్తున్న ఊహాగానాలను ఇజ్రాయిల్ ప్రధాని కార్యాలయం కొట్టిపారేసింది.

Exit mobile version