Iran-US War: ఇరాన్‌పై అమెరికా దాడులు.. కూలిన అతి పెద్ద వంతెన.. 8 మంది మృతి
- ఇరాన్‌పై అమెరికా దాడులు
- కూలిన అతి పెద్ద వంతెన
- 8 మంది మృతి... 95 మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రాచ్యం మరోసారి తీవ్ర స్థాయిలో అట్టుడుకుతోంది. 2, 3 వారాల్లో ఇరాన్ అంతు చూస్తామంటూ ట్రంప్ హెచ్చరించిన తర్వాత అమెరికా సైన్యం దాడులు తీవ్రతరం చేసింది. తాజాగా ఇరాన్‌లో అతి పెద్ద వంతెనపై అమెరికా దళాలు దాడులు చేశాయి. దీంతో వంతెన కూలిపోయింది. ఈ వంతెన ఇంకా నిర్మాణంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అమెరికా చేసిన దాడిలో 8 మంది మృతి చెందగా.. 95 మంది వరకు గాయాలు పాలైనట్లుగా ఇరాన్ మీడియా పేర్కొంది. వంతెనపై దాడి చేసిన తర్వాత ఇరాన్‌పై మరిన్ని దాడులు జరగబోతున్నాయని ట్రంప్ పేర్కొన్నారు.
కూలిపోయిన అతి పెద్ద వంతెన ఇంకా నిర్మాణంలో ఉంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ను పశ్చిమ నగరమైన కరాజ్‌తో కలుపుతుంది. 136 మీటర్ల ఎత్తులో ఈ వంతెనను నిర్మిస్తున్నారు. మధ్యప్రాచ్యపు ఇంజనీరింగ్ అద్భుతంగా ఈ వంతెన డిజైన్ చేశారు. వంతెనపై అమెరికా దాడి చేయగానే పెద్ద ఎత్తున పొగ ఆకాశాన్ని అంటింది. తొలి దాడి బాధితులకు సహాయం చేసేందుకు అత్యవసర బృందాలను ఘటనా స్థలానికి పంపిన సమయంలోనే రెండో దాడి జరిగిందని ఇరాన్ మీడియా పేర్కొంది.
Also Read
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
ఇక దాడికి సంబంధించిన దృశ్యాలను ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేస్తూ.. ‘‘ఇరాన్‌లోని అతిపెద్ద వంతెన కూలిపోయింది. ఇకపై దాన్ని ఎప్పటికీ ఉపయోగించలేరు. ఇంకా మరెన్నో దాడులు జరగనున్నాయి.!’’ అని ట్రంప్ పేర్కొన్నారు. మరీ ఆలస్యం కాకముందే ఇరాన్ ఒక ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ హెచ్చరించారు.
గురువారం అమెరికా ప్రజలను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా భవిష్యత్ కోసం ఇరాన్‌తో యుద్ధం చేస్తున్నట్లుగా ప్రకటించారు. 2, 3 వారాల్లో ఇరాన్ అంతు చూస్తామంటూ ప్రకటించారు. అమెరికా నాశనం కావాలని కోరుకున్న వారి అంతు చూస్తామంటూ ఇరాన్‌ను ట్రంప్ హెచ్చరించారు. వార్నింగ్ ఇచ్చినట్లుగానే ప్రస్తుతం పశ్చిమాసియాలో దాడులు తీవ్రం అయ్యాయి.
ఇది కూడా చదవండి: US Army Chief Fired: యుద్ధం మధ్యలో ఆర్మీ చీఫ్‌కు షాకిచ్చిన రక్షణ మంత్రి.. అమెరికా సైన్యంలో భారీ కుదుపు
🚨BREAKING:🇺🇸 Trump posted footage of the US strike on the B-1 bridge in Karaj, Iran.
He says, it is time to make a deal or face further destruction of civilian infrastructure.
🇮🇷 Iran's meditator has reportedly killed in Israel's strikes. pic.twitter.com/I8Jj8oNPML
— Saturn World News (@SaturnWorldNews) April 2, 2026
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!