Iran War: అప్పటి వరకు యుద్ధం ఆగదు.. అమెరికాకు ఇరాన్ షాక్..

  • అమెరికాకు బిగ్ షాక్ ఇచ్చిన ఇరాన్..
  • తమ డిమాండ్లు నెరవేరే వరకు యుద్ధం ఆగదని ప్రకటన..
  • యూఎస్‌కు 5 షరతులు విధించిన ఇరాన్..
Iran War (1)

Iran War (1)

Iran War: యుద్ధం ముగించేందుకు అమెరికా పెట్టిన 15 షరతుల్ని ఇరాన్ తిరస్కరించింది. బదులుగా అమెరికాకే 5 షరతుల్ని విధిస్తూ షాక్ ఇచ్చింది. తమ షరతులు అంగీకరిస్తేనే యుద్ధాన్ని ముగిస్తామని, లేదంటే అప్పటి వరకు యుద్ధం ఆగదని స్పష్టం చేసింది. ప్రతిపాదన వివరాలు తెలిసిన ఇరాన్ అధికారి మీడియాతో మాట్లాడారు. అమెరికా ప్రతిపాదనలు అతిశయోక్తిగా ఉన్నాయని అన్నారు.

‘‘ఇరాన్ తాను నిర్ణయించుకున్నప్పుడు మరియు తన షరతులు నెరవేరినప్పుడు మాత్రమే యుద్ధాన్ని ముగిస్తుంది’’ అని ఇరాన్ స్పష్టం చేసింది. తమ షరతులు నెరవేరే దాకా భారీ దాడులు చేస్తూనే ఉంటామని హెచ్చరించింది. గతంలో రెండుసార్లు అమెరికా ఇరాన్‌ను మోసం చేసిన విధానాన్ని సదరు అధికారి ఎత్తిచూపారు. చర్చల్లో నిజంగా పాల్గొనాలనే ఉద్దేశం అమెరికాకు లేదని అన్నారు.

5 షరతులు ఇవే:

1) అమెరికా, ఇజ్రాయిల్ హత్యలు, దురాక్రమణను ఆపేయాలి.
2) ఇరాన్‌పై భవిష్యత్తులో ఎలాంటి సైనిక చర్యకు దిగకుండా పరిష్టమైన రక్షణ చర్యలు ఏర్పాటు చేయాలి.
3) యుద్ధం వల్ల కలిగిన నష్టానికి నష్టపరిహారాన్ని చెల్లించాలి.
4) ఈ ప్రాంతంలో అన్ని ప్రాంతాల నుంచి యుద్ధాన్ని విరమించుకోవాలి.
5) హార్ముజ్ జలసంధిపై ఇరాన్ సార్వభౌమాధికారాన్ని గుర్తించి, అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వాలి.