Iran-US War: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రం.. హార్ముజ్ దగ్గర కూలిన మరో అమెరికా యుద్ధ విమానం
- పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రం
- ఇరాన్-అమెరికా మధ్య భీకర దాడులు
- అమెరికా యుద్ధ విమానాలను టార్గెట్ చేసుకున్న ఇరాన్
- హార్ముజ్ జలసంధి దగ్గర కూలిన మరో విమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్-అమెరికా మధ్య పరిస్థితులు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఇరాన్‌లోని అతిపెద్ద వంతెనను అమెరికా కూల్చేసిన తర్వాత పరిణామాలు కఠినంగా మారాయి. ప్రస్తుతం అమెరికా యుద్ధ విమానాలను ఇరాన్ టార్గెట్ చేసుకుంది.
ఇది కూడా చదవండి: Delhi Rain: ఢిల్లీలో వర్షం.. పలు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Also Read
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
శుక్రవారం అమెరికా వైమానిక దళానికి చెందిన ఎఫ్-15ఈ స్టైక్ ఈగిల్ యుద్ధ విమానాన్ని గగనతలంలో ఇరాన్ కూల్చేసింది. ఈ విమానంలో ఇద్దరు పైలట్లు ఉన్నారు. ఒక పైలట్, ఇంకొకరు వెపన్ సిస్టమ్ ఆఫీసర్ ఉన్నారు. అయితే ఇందులో ఒకరు సేఫ్‌గా బయట పడగా.. ఇంకొకరు గల్లంతయ్యారు. తొలుత తమ స్వాధీనంలో ఉన్నట్లు ఇరాన్ ప్రకటించగా.. అంతలోనే మాట మార్చింది. సజీవంగా పట్టుకుంటే బహుమతి ఇస్తామని ఇరాన్ ప్రకటించింది. ఇప్పటికీ అతడి ఆచూకీ లభించలేదు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..
ఇదిలా ఉండగా తాజాగా హార్ముజ్ జలసంధి దగ్గర ఏ-10 థండర్‌బోల్ట్ II విమానం కూలిపోయింది. అయితే ఈ పైలట్‌ను అమెరికా సురక్షితంగా రక్షించినట్లుగా న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అమెరికా అధికారుల ప్రకారం.. కూలిపోయిన విమానం ఫెయిర్‌చైల్డ్ రిపబ్లిక్ A-10 థండర్‌బోల్ట్ II అని.. దీనిని సాధారణంగా A-10 వార్‌హాగ్ అని పిలుస్తారని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. ఈ విమానం హార్ముజ్ జలసంధి సమీపంలో కూలిపోయింది. ప్రమాదానికి గల కారణం గానీ.. పరిస్థితుల గురించి అధికారులు ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. ఇదిలా ఉండగా తమ వాయు రక్షణ వ్యవస్థలు శత్రువుకు చెందిన A-10 విమానాన్ని లక్ష్యంగా చేసుకున్నాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
గత నెల 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా కీలక నేతలంతా హతమయ్యారు. దీంతో మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్‌లోని కీలక ప్రాంతాలను అమెరికా, ఇజ్రాయెల్ ధ్వంసం చేశాయి. ఇక ఇరాన్ కూడా ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై దాడులు చేశాయి. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని మూసేశాయి. దీంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది.
ఇదిలా ఉంటే ఇటీవల అమెరికా ప్రజలను ఉద్దేశించి ట్రంప్ కీలక ప్రసంగం చేశారు. 2, 3 వారాల్లో ఇరాన్ అంతు చూస్తామని.. ఇదంతా అమెరికా భవిష్యత్ కోసమే చేస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
తాజావార్తలు
-
Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్‌కు త్రిషా కృష్ణన్.. విజయ్‌తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్‌లో చర్చ
-
India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
-
AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
-
BRICS Summit 2026: మోడీ-జిన్‌పింగ్ భేటీ.. బ్రిక్స్ ఉమ్మడి ప్రకటన.. సదస్సు తొలి రోజు 10 కీలక విషయాలు
-
Aamir Khan: లోకేష్ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి.. మరో సూపర్‌హీరో మూవీకి ఆమిర్ ఖాన్ రెడీ! దర్శకుడు ఎవరంటే?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!