Delhi Rain: ఢిల్లీలో వర్షం.. పలు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
- ఢిల్లీలో వర్షం
- నోయిడాలో వడగళ్ల వాన
- పలు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. కొద్దిరోజులుగా తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ఢిల్లీ వాసులకు భారీ వర్షాలతో వాతావరణం చల్లబడింది. దీంతో ప్రజలు ఎండ వేడి నుంచి ఉపశమనం పొందుతున్నారు. చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి వర్షాలు కురుస్తు్న్నాయి. మండుటెండల్లో భారీ వర్షాలు కురవడంతో చలి గాలులతో సేదదీరుతున్నారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో నోయిడాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నోయిడాలో అయితే వడగళ్ల వాన కురిసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఐఎండీ వార్నింగ్..
ఇదిలా ఉంటే శనివారం ఢిల్లీతో సహా 9 రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు ఉంటాయని.. తుఫానులు ముంచెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది. ఏప్రిల్ 4-5 తేదీల్లో బలమైన గాలులు, వర్షం, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని.. దీంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది.
Also Read
- UP 2027 Elections: యూపీ 2027 ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు.. సీట్ల పంపకంలో చిక్కుముడి
- India’s Nuclear Arsenal: భారత్ వద్ద 190 అణు వార్హెడ్లు? FAS నివేదికలో సంచలన వివరాలు
- CM Vijay vs MK Stalin: ‘అసెంబ్లీని రీల్స్ చేసే వేదికగా మార్చొద్దు’.. సీఎం విజయ్‌పై స్టాలిన్ విమర్శలు
- Kashmiri Pandits: టార్గెట్ కాశ్మీరీ పండిట్స్..ఉద్యోగాలు మానకపోతే చం*పేస్తాం!
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని కోరింది. ఏప్రిల్ 7వ తేదీ నాటికి ఉత్తర భారతదేశంలోకి ఒక కొత్త పశ్చిమ అవాంతరం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీనివల్ల వర్షపాతం పెరిగే అవకాశం ఉందని.. ఈ సమయంలో రైతులు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.
ఉత్తర ప్రదేశ్‌లో కూడా వాతావరణం మారనుందని.. రాబోయే 24 గంటల్లో బలమైన ఉరుములు, వానలు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రాజధాని లక్నో.. దాని పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండే అవకాశం ఉందని.. ఉరుములు, వానలు, వడగళ్లు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
IMD Weather Alert !
Two back-to-back western disturbances are set to impact Northwest India this week, with peak activity expected on April 3–4 and again on April 7.
🌩️ Hailstorms likely across parts of the region
🌧️ Isolated heavy rainfall expected over Kashmir Valley on April… pic.twitter.com/WNAFru5V1A— India Meteorological Department (@Indiametdept) April 3, 2026
#WATCH उत्तर प्रदेश | नोएडा के कई हिस्सों में तेज बारिश हुई। pic.twitter.com/uSIpe5F4OW
— ANI_HindiNews (@AHindinews) April 3, 2026
తాజావార్తలు
-
Botsa Satyanarayana Emotional: బొత్స సత్యనారాయణ కంటతడి.. వైసీపీ సమావేశంలో భావోద్వేగం
-
IND vs AFG: హర్షిత్ రాణా అవుట్.. యువ పేసర్‌కు లక్కీ ఛాన్స్!
-
UP 2027 Elections: యూపీ 2027 ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు.. సీట్ల పంపకంలో చిక్కుముడి
-
Bhatti Vikramarka: ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి!
-
Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?