NTV Telugu Site icon

Iran: ఉద్రిక్తతల నడుమ.. కొత్త డ్రోన్‌లు, మిస్సైళ్లని ఆవిష్కరించిన ఇరాన్..

Iran

Iran

Iran: మిడిల్ ఈస్ట్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సమయంలోనే ఇరాన్ శనివారం మిలిటరీ పెరేడ్‌లో తన కొత్త బాలిస్టిక్ మిసైల్స్, అప్ గ్రేడ్ చేసిన వన్-వే అటాక్ డ్రోన్లు ఆవిష్కరించింది. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు డ్రోన్లు, క్షిపణులను సరఫరా చేసినట్లు ఇరాన్ వెస్ట్రన్ దేశాల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఘన-ఇంధన జిహాద్ క్షిపణిని ఇరాన్ యొక్క రివల్యూషనరీ గార్డ్స్ యొక్క ఏరోస్పేస్ విభాగం రూపొందించింది. ఇది 1000 కి.మీ దూరంలోని లక్ష్యాలను కూడా చేరుకోగలదని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. షాహెద్-136బి డ్రోన్ షాహెద్-136 యొక్క అప్‌గ్రేడ్ వెర్షన్, కొత్త ఫీచర్లు కలిగి ఉండటంతో పాటు 4000 కి.మీ పరిధిని కలిగి ఉంది. సద్దాం హుస్సేన్ సమయంలో ఇరాక్‌తో 1980-88 యుద్ధాన్ని స్మరించుకుంటూ టెహ్రాన్‌లో జరిగిన వార్షిక పెరేడ్‌కి కొత్త అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ హాజరయ్యారు. ఇస్లామిక్ దేశాల మధ్య ఐక్యత, ఇజ్రాయిల్‌ని అడ్డుకోగలదని అన్నారు.

Read Also: Vizag: వివాహేతర సంబంధం.. ప్రియురాలిపై కత్తితో దాడి..

ఇజ్రాయిల్ ఇరాన్ మద్దతు కలిగిన హిజ్బుల్లా మిలిటెంట్లపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే లెబనాన్ వ్యాప్తంగా పేజర్లు, వాకీ-టాకీలు ఒక్కసారిగా పేలిపోవడం సంచలనంగా మారింది. ఈ పేలుళ్లలో 37 మంది మరణించారు. 3000 మందికి పైగా గాయపడ్డారు. అయితే, ఇది ఇజ్రాయిల్, దాని గూఢచార సంస్థ మొసాద్ పనే అని హిజ్బుల్లా ఆరోపిస్తోంది. ఈ దాడి తమకు పెద్ద దెబ్బగా అభివర్ణిసూ, ఇజ్రాయిల్‌పై తప్పకుండా ప్రతీకారం ఉంటుందని ఆ సంస్థ చీఫ్ హసన్ నస్రల్లా హెచ్చరించాడు. ఇదిలా ఉంటే, ఈ ఘటన తర్వాత రోజే లెబనాన్ రాజధాని బీరూట్‌లో ఇజ్రాయిల్ ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది. ఈ దాడుల్లో 16 మంది హిజ్బుల్లా మిలిటెంట్లను హతమార్చింది. ఇందులో కీలక కమాండర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.