Iran: ఉద్రిక్తతల నడుమ.. కొత్త డ్రోన్‌లు, మిస్సైళ్లని ఆవిష్కరించిన ఇరాన్..
- మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తలు..
- ఉద్రిక్తతల నడుము మిస్సైళ్లు..డ్రోన్లని ఆవిష్కరించిన ఇరాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: మిడిల్ ఈస్ట్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సమయంలోనే ఇరాన్ శనివారం మిలిటరీ పెరేడ్‌లో తన కొత్త బాలిస్టిక్ మిసైల్స్, అప్ గ్రేడ్ చేసిన వన్-వే అటాక్ డ్రోన్లు ఆవిష్కరించింది. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు డ్రోన్లు, క్షిపణులను సరఫరా చేసినట్లు ఇరాన్ వెస్ట్రన్ దేశాల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఘన-ఇంధన జిహాద్ క్షిపణిని ఇరాన్ యొక్క రివల్యూషనరీ గార్డ్స్ యొక్క ఏరోస్పేస్ విభాగం రూపొందించింది. ఇది 1000 కి.మీ దూరంలోని లక్ష్యాలను కూడా చేరుకోగలదని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. షాహెద్-136బి డ్రోన్ షాహెద్-136 యొక్క అప్‌గ్రేడ్ వెర్షన్, కొత్త ఫీచర్లు కలిగి ఉండటంతో పాటు 4000 కి.మీ పరిధిని కలిగి ఉంది. సద్దాం హుస్సేన్ సమయంలో ఇరాక్‌తో 1980-88 యుద్ధాన్ని స్మరించుకుంటూ టెహ్రాన్‌లో జరిగిన వార్షిక పెరేడ్‌కి కొత్త అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ హాజరయ్యారు. ఇస్లామిక్ దేశాల మధ్య ఐక్యత, ఇజ్రాయిల్‌ని అడ్డుకోగలదని అన్నారు.
Read Also: Vizag: వివాహేతర సంబంధం.. ప్రియురాలిపై కత్తితో దాడి..
Also Read
- Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
ఇజ్రాయిల్ ఇరాన్ మద్దతు కలిగిన హిజ్బుల్లా మిలిటెంట్లపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే లెబనాన్ వ్యాప్తంగా పేజర్లు, వాకీ-టాకీలు ఒక్కసారిగా పేలిపోవడం సంచలనంగా మారింది. ఈ పేలుళ్లలో 37 మంది మరణించారు. 3000 మందికి పైగా గాయపడ్డారు. అయితే, ఇది ఇజ్రాయిల్, దాని గూఢచార సంస్థ మొసాద్ పనే అని హిజ్బుల్లా ఆరోపిస్తోంది. ఈ దాడి తమకు పెద్ద దెబ్బగా అభివర్ణిసూ, ఇజ్రాయిల్‌పై తప్పకుండా ప్రతీకారం ఉంటుందని ఆ సంస్థ చీఫ్ హసన్ నస్రల్లా హెచ్చరించాడు. ఇదిలా ఉంటే, ఈ ఘటన తర్వాత రోజే లెబనాన్ రాజధాని బీరూట్‌లో ఇజ్రాయిల్ ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది. ఈ దాడుల్లో 16 మంది హిజ్బుల్లా మిలిటెంట్లను హతమార్చింది. ఇందులో కీలక కమాండర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!