Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Iran Tehran Flights Resume After War Ceasefire Middle East

Iran: 2 నెలల యుద్ధం తర్వాత టెహ్రాన్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం

Published Date :April 25, 2026 , 2:10 pm
By Suresh Maddala
  • పశ్చిమాసియాలో శాంతించిన యుద్ధ వాతావరణం
  • 2 నెలల తర్వాత టెహ్రాన్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం
  • కాల్పుల విరమణ కారణంగా సర్వీసులు ప్రారంభించినట్లు వెల్లడి
Iran: 2 నెలల యుద్ధం తర్వాత టెహ్రాన్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం
  • Follow Us :
  • google news
  • dailyhunt

పశ్చిమాసియాలో రెండు నెలల పాటు యుద్ధంతో దద్దరిల్లింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేయగా.. ఇరాన్ ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై యుద్ధం చేసింది. దీంతో రెండు నెలల పాటు మధ్యప్రాచ్యం వైమానిక దాడులు.. బాంబ్ దాడులతో మార్మోగింది. దీంతో ఇంటర్నెట్‌తో పాటు గగనతలాన్ని ఇరాన్ మూసేసింది. అయితే తాజాగా ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిరవధికంగా పొడిగించినట్లుగా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీంతో ఇప్పడిప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం టెహ్రాన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. యుద్ధం కారణంగా రెండు నెలల పాటు నిలిచిపోయిన సర్వీసులు ఈరోజు నుంచి పునరుద్ధరించారు. యుద్ధం కారణంగా ఇరాన్‌లో చిక్కుకున్న వారంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. స్వదేశాలకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.

శనివారం టెహ్రాన్‌లోని ఇమామ్ ఖమేనీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండచి వాణిజ్య విమాన సర్వీసులను పునఃప్రారంభమైనట్లుగా అధికారులు తెలిపారు. ఇస్తాంబుల్, ఒమన్‌లోని మస్కట్, సౌదీ అరేబియాలోని మదీనాకు విమానాలు బయలుదేరాయని ప్రభుత్వ ఆధీనంలోని టెలివిజన్ తెలిపింది. ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

Also Read

  • Iran-US Talks: ఇస్లామాబాద్‌లో అసిమ్ మునీర్‌తో ఇరాన్ బృందం భేటీ
  • Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా 'మెగా' దాడి.. 666 క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డ పుతిన్ సైన్యం!
  • Funeral Dance: అంత్యక్రియల్లో అశ్లీల డ్యాన్స్‌లు.. అవాక్కైన నెటిజన్లు
  • Panama Canal: హార్మూజ్‌ జలసంది మూసివేత..! ఒక్కో ట్యాంకర్‌పై రూ.37 కోట్లు సంపాదిస్తున్న ఓ చిన్న దేశం..

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇరాన్ బృందం ఇస్లామాబాద్‌లో చర్చలు జరుపుతున్నారు. అమెరికా బృందం శనివారం సాయంత్రానికి చేరుకోనున్నారు.

ఈ సారి జేడీ వాన్స్ కాకుండా అమెరికా నుంచి మధ్యప్రాచ్యంలోని అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ మాత్రమే ఇస్లామాబాద్ వెళ్తున్నట్లుగా వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవట్ తెలిపారు. చర్చల కోసం ఇరానీయులు సంప్రదించారని.. ముఖాముఖి సంభాషణ కోసం అడిగారని తెలిపారు. చర్చల విషయాలను అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు తమ బృందం వివరిస్తారని చెప్పారు.

ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఇస్లామాబాద్ వేదికగా 21 గంటల పాటు తొలి దశ చర్చలు జరిగాయి. కానీ ఈ చర్చలు విఫలమయ్యాయి. రెండో దఫా చర్చలు గత బుధవారం జరగొచ్చని వార్తలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో వాయిదా పడ్డాయి. అనూహ్యంగా శనివారం మరోసారి చర్చలకు శ్రీకారం చుట్టారు. ఈ చర్చలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈసారైనా చర్చలు ఫలిస్తాయా? లేదా? అన్నదానిపై ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది.

ఇక ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరుగుతుండగా పెద్ద ఎత్తున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇస్లామాబాద్ నగరాన్ని పూర్తిగా భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. నగరంలోకి ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • global news aviation
  • international flights Iran
  • Iran airspace reopening
  • Iran flights resume
  • Iran travel update

తాజావార్తలు

  • Iran: 2 నెలల యుద్ధం తర్వాత టెహ్రాన్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం

  • Dharmapuri Arvind: పిట్టల దొర క్యారెక్టర్ కేసీఆర్ అయితే.. పిట్టల దొరసాని క్యారెక్టర్ కవితది

  • Punjab: ‘‘పంజాబ్‌ ద్రోహులు’’ వెలసిన ఆప్ తిరుగుబాటు ఎంపీల పోస్టర్లు

  • Paytm: టెన్షన్ వద్దు.. మీ డబ్బులు సేఫ్! పేటియం బ్యాంక్ లైసెన్స్ రద్దైనా డబ్బు ఎలా వస్తుందంటే..

  • Swati Maliwal: ఆప్‌కు స్వాతి మాలివాల్ గుడ్‌బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions