ఎట్టకేలకు ఇరాన్ దిగొచ్చింది. అమెరికాతో అణు ఒప్పందం చేసుకొనేందుకే సిద్ధపడింది. అమెరికాతో న్యాయమైన అణు ఒప్పందం చేసుకోవడానికి ఎదురుచూస్తున్నట్లు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సన్నిహితుడు అలీ షమ్ఖానీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అమెరికాతో చర్చలు జరిపేందుకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చిని ఒమన్‌కు పంపుతున్నట్లు పేర్కొన్నారు. చర్చలు సానుకూలంగా ఉంటే.. అమెరికాతో అణు ఒప్పందం చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి, అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ నాయకత్వంలో అణు చర్చలు జరగనున్నట్లు తెలిపాయి.
ఇది కూడా చదవండి: Shalini Pandey: ఆ హీరోతో రొమాన్స్ చేయాలనేది నా కోరిక..
అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందం చేసుకోకపోతే తీవ్రమైన బాంబు దాడులు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దీంతో ఇరు దేశాల మధ్య పరిస్థితి తీవ్రమైంది. దీనిపై ఇరాన్ కూడా స్పందిస్తూ.. అందుకు ధీటుగా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మొత్తానికి చర్చలకు శ్రీకారం జరిగింది.
ఇది కూడా చదవండి: Venkaiah Naidu: నేతల భూతులు వినలేక.. గత ఎన్నికల్లో ఓట్లు వేసి ఓడించారు..