US Iran Tensions: హార్ముజ్ జలసంధిపై అమెరికా LUCAS డ్రోన్ కూల్చివేసిన ఇరాన్!

  • అమెరికా LUCAS అటాక్ డ్రోన్ కూల్చివేత..
  • హార్ముజ్ జలసంధి వద్ద కూల్చేసినట్లు ప్రకటించిన ఇరాన్..
Us Iran Tensions

Us Iran Tensions

US Iran Tensions: హార్ముజ్ జలసంధిపై అమెరికా తయారీకి చెందిన LUCAS అటాక్ డ్రోన్‌ను కూల్చివేసినట్లు, మరో డ్రోన్‌ను అడ్డుకున్నట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. ఇరాన్, అమెరికాల మధ్య పెరుగుతున్న తాజా ఉద్రిక్తతల సమయంలో ఈ ఘటన జరిగింది. ఇరాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ IRIB ప్రకటన ప్రకారం.. వ్యూహాత్మకంగా కీలకమైన హార్ముజ్ జలసంధిపై ఎగురుతున్న డ్రోన్‌ను ఇరాన్ సైన్యానికి చెందిన వైమానిక రక్షణ వ్యవస్థ గుర్తించి ధ్వంసం చేసిందని తెలిపింది.

దీనికి ముందు ఖేష్మ్ ద్వీపానికి దక్షిణంగా అమెరికాకు చెందిన MQ-1 ప్రిడేటర్ డ్రోన్‌ను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. మరోవైపు, బహ్రెయిన్ వైపు ప్రయోగించిన పలు ఇరాన్ వన్-వే అటాక్ డ్రోన్లను అడ్డుకున్నట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే ఇరాన్ నుంచి LUCAS అటాక్ డ్రోన్‌‌ను కూల్చివేసినట్లు ప్రకటన విచ్చింది.