Site icon NTV Telugu

Israel-Iran War: దుబాయ్ పామ్ జుమైరాపై ఇరాన్ క్షిపణి దాడి..

Dubai

Dubai

Israel-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయిల్, అమెరికా సంయుక్తంగా జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా మిత్ర దేశాలపై దాడులు చేస్తోంది. ముఖ్యంగా పశ్చి్మాసియాలోని అమెరికన్ సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. ఈ దాడులు సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్, బహ్రైయిన్‌, ఇరాక్‌పై కొనసాగాయి. దుబాయ్, రియాద్, అబుదాబి నగరాలు దాడులకు గురయ్యాయి.

Read Also: Sri Lanka vs Pakistan: ఫర్హాన్ ఊచకోత.. పాకిస్థాన్ తుఫాన్ ఇన్నింగ్స్.. శ్రీలంక ముందు భారీ లక్ష్యం!

ఇదిలా ఉంటే, దుబాయ్ టార్గెట్‌గా మరోసారి ఇరాన్ దాడులు జరిపింది. దుబాయ్‌లోని ప్రఖ్యాత ‘‘పామ్ జుమైరా’’ ద్వీపంపై ఇరాన్ దాడులకు తెగబడింది. ఈ విషయాన్ని యూఏఈ ప్రభుత్వం కూడా ధ్రువీకరించింది. ఈ దాడిలో నలుగురికి గాయాలైనట్లు తెలిపింది. క్షిపణి దాడిలో చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చినట్లు ప్రకటించింది. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని యూఏఈ సూచించింది. దుబాయ్ మాత్రమే కాకుండా, అబుదాబిని కూడా ఇరాన్ టార్గెట్ చేసింది. అబుదాబిలోని “ఒక నివాస ప్రాంతంలో కొన్ని క్షిపణి శిథిలాలు పడిపోవడం” కారణంగా ఆసియా జాతీయుడైన ఒక పౌరుడు మరణించాడని UAE రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్ దాడుల్ని పిరికిపంద చర్యగా అభివర్నించింది.

Exit mobile version