Site icon NTV Telugu

Iran- Israel Conflict: ఇజ్రాయెల్ దెబ్బకి భయపడి గగనతలం మూసి మళ్లీ తెరిచిన ఇరాన్‌

Iran

Iran

Iran- Israel Conflict: ఇరాన్‌పై దాడి తప్పదని ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజమాన్ నెతన్యాహూ చేసిన వ్యాఖ్యలతో ఇరాన్‌ అలర్ట్ అయింది. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం (అక్టోబర్‌7) ఉదయం 6 గంటల దాకా దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల నుంచి విమానాల రాకపోకలను రద్దు చేసింది. అయితే విమానాల భద్రతకు సంబంధించి కొన్ని చర్యలు తీసుకున్న తర్వాత ఈ రోజు విమాన సర్వీసులన్నింటినీ పునరుద్ధరించినట్లు సివిల్‌ ఏవియేషన్‌ అధికారులు ప్రకటించారు.

Read Also: Tollywood : తెలుగు ప్రేక్షకులను కాదు.. తెలుగు భాషను అగౌరవిస్తున్నారు..?

ఇక, అక్టోబర్‌ 7 సందర్భంగా ఇజ్రాయెల్‌ దాడి చేస్తుందేమోనన్న భయంతోనే ఇరాన్‌ తన గగనతలంలో విమానాలను క్యాన్సిల్ చేసినట్లు సమాచారం. గతేడాది అక్టోబర్‌7వ తేదీన ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన హమాస్‌ ఉగ్రవాదులు దాడి చేసి వేల మందిని హతమార్చారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్‌ అటు హమాస్‌ ఇటు హెజ్బొల్లా గ్రూపులపై దాడులు కొనసాగిస్తునే ఉంది. ఈ తీవ్రవాద గ్రూపులన్నీ ఇరాన్‌ స్నేహితులే కావడంతో అలర్ట్ అయింది. అయితే, హిజ్బుల్లా మాజీ చీఫ్ హసన్ నస్రల్లాతో సహా దాని ఆ గ్రూపు యొక్క టాప్ కమాండర్లను ఇజ్రాయెల్ చంపినందుకు ప్రతీకారంగా ఇరాన్ అక్టోబర్ 1న ఇజ్రాయెల్‌పై క్షిపణులతో దాడికి దిగింది. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని ప్రతిజ్ఞ చేశారు. ఇక, బీరూట్‌లో వైమానిక దాడిలతో పాటు హిజ్బుల్లాకు చెందిన నేతలను వరుసగా ఇజ్రాయెల్ చంపేస్తూ వస్తుంది. పేజర్లు, వాకీ-టాకీలతో పేళ్లులు జరిపింది ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ దళాలు.

Exit mobile version