Iran: హిజాబ్ ధరించని మహిళలను గుర్తించేందుకు సీసీ కెమెరాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: ఇరాన్ దేశంలో ముస్లిం మతాచారాలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో తెలుసు. ముఖ్యంగా హిజాబ్ అంశంలో ఆ దేశం కఠినంగా వ్యవహరిస్తోంది. గతేడాది మహ్సా అమిని అనే మహిళ హిజాబ్ సరిగ్గా ధరించని కారణంగా ఇరాన్ మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ తరువాత ఆ అమ్మాయి చనిపోవడంతో ఇరాన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మహిళలు, యువత ప్రభుత్వానికి, హిజాబ్ కు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే చేశారు. మహిళలు హిజాబ్ తీసివేసి, జట్టు కత్తిరించుకుని నిరసన తెలిపారు.
Read Also: Somu Veerraju: ఢిల్లీకి ఏపీ బీజేపీ చీఫ్… మూడు రోజులు హస్తినలోనే మకాం
Also Read
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ ఆందోళనలు తగ్గిపోవడంతో హిజాబ్ పట్ల కఠినంగా వ్యవహరించేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. షరియా చట్టం ప్రకారం మహిళలు తమ జట్టును హిజాబ్ తో కప్పుకోవాలి. అయితే దీన్ని పకడ్భందీగా అమలు చేసేందుకు బహిరంగ ప్రదేశాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తోంది అక్కడి ప్రభుత్వం. హిజాబ్ ధరించని మహిళలను గుర్తించి శిక్షలు, జరిమానాలు విధిస్తామని అక్కడి అధికారులు శనివారం ప్రకటించారు. హిజాబ్ ఉల్లంఘించిన వారికి తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు.
హిజాబ్ చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారిని నిరోధించాలని ఇరాన్ లక్ష్యంగా పెట్టుకుంది. హిజాబ్ ఉల్లంఘన దేశ ఆధ్యాత్మిక ప్రతిష్టను దెబ్బతీస్తుందని అక్కడి న్యాయవ్యవస్థ, ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఇప్పటికే ఇరాన్ లోని మాల్స్, రెస్టారెంట్స్, దుకాణాల్లో హిజాబ్ డ్రెస్ కోడ్ ధిక్కరించిన వారిని అరెస్ట్ చేస్తోంది. 1979 విప్లవం తర్వాత ఇరాన్ ఇస్లామిక్ చట్టాలను అమలు చేస్తోంది. దీంట్లో భాగంగా అప్పటి నుంచి 7 ఏళ్లు దాటిని అమ్మాయిలు, మహిళలు తప్పకుండా హిజాబ్ ధరించాలనే చట్టాన్ని చేసింది. ఇటీవల హిజాబ్ లేకుండా దుకాణానికి వచ్చిన ఇద్దరు మహిళలపై ఓ వ్యక్తి పెరుగుతో దాడి చేయడం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది.
తాజావార్తలు
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
-
OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
-
OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
-
Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15 వేల లోపు లభించే కొత్త ఫోన్ల జాబితా వెల్లడి..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!