NTV Telugu Site icon

Iran: ఇరాన్-పాకిస్తాన్ బోర్డర్‌లో టెన్షన్.. 9 మంది విదేశీయుల కాల్చివేత..

Iran Pakistan

Iran Pakistan

Iran: మరోసారి ఇరాన్-పాకిస్తాన్ సరిహద్దుల్లో టెన్షన్ నెలకొంది. ఇటీవల ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ముందుగా ఇరాన్, పాక్ బలూచిస్తాన్ లోని ఇరాన్ వ్యతిరేక మిలిటెంట్లపై వైమానిక దాడులు చేసింది. ఆ తర్వాత పాక్ ఇరాన్‌పై మిస్సైల్ అటాక్స్ చేసింది.

ఇదిలా ఉంటే మరోసారి ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. ఆగ్నేయ ఇరాన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు 9 మంది విదేశీయులను హతమార్చారని ఇరాన్ మీడియా నివేదించింది. ఈ రోజు ఉదయం గుర్తుతెలియని సాయుధ వ్యక్తుల ఇరాన్ లోని సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని సరవన్ నగరంలోని సిర్కాన్ పరిసరాల్లో ఇంట్లోని 9 మంది ఇరానియన్లు కాని వారిని కాల్చి చంపారు.

Read Also: Gyanvapi Mosque: జ్ఞానవాపిని హిందువులకు అప్పగించండి.. ఏఎస్ఐ నివేదిక తర్వాత వీహెచ్‌పీ..

అయితే, ఇప్పటి వరకు ఈ ఘటనకు ఎవరూ బాధ్యత ప్రకటించుకోలేదు. షియా ముస్లింల ఆధిపత్యం కలిగిన ఇరాన్‌లో సిస్తాన్-బలూచిస్తాన్ ప్రాంతంలో సున్నీలు అధికం. ఈ ప్రాంతంలో డ్రగ్స్ ముఠాలు, బలూచీ మైనారిటీలు ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. సరిహద్దుల్లోని పాక్ నుంచి వీరు ఇరాన్ అధికారులపై దాడులకు తెగబడుతున్నారు. దీంతో జనవరి 18న, ఇరాన్, పాక్‌పై దాడులు చేసింది, ఆ తర్వాత రెండు రోజులకు పాక్, ఇరాన్‌పై దాడి చేసింది.