NTV Telugu Site icon

Israel: ఇరాన్ మంత్రితో హిజ్బుల్లా చీఫ్ భేటీ.. ఇజ్రాయిల్‌పై హిజ్బుల్లా రాకెట్ దాడి..

Hizbollah

Hizbollah

Israel: ఇరాన్ ప్రాక్సీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దోల్లాహియాన్‌తో బీరుట్‌లో సమావేశమయ్యారని లెబనీస్ మూమెంట్ గురువారం తెలిపింది. అక్టోబర్ 7న ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి లెబనాన్, ఇజ్రాయిల్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇజ్రాయిల్ ఉత్తర సరిహద్దుపై హిజ్బుల్లా మిలిటెంట్లు దాడులకు పాల్పడుతున్నారు.

ఈ దాడులకు ఇరాన్ మద్దతు ఇస్తుందని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. తాజాగా ఇరాన్ మంత్రి, హిజ్బుల్లా చీఫ్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. పాలస్తీనా, లెబనాన్, గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిల్ దురాక్రమణను అంతం చేసే ప్రయత్నాలను ఇరు పక్షాలు సమీక్షించాయి. ఇరాన్ మంత్రి బుధవారం యుద్ధం అదుపు తప్పుతుందని హెచ్చరించారు.

Read Also: Andhra Pradesh: ప్రేమ పేరుతో మోసం చేసి అత్యాచారం చేసిన హిందీ టీచర్

ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ ఉత్తర భాగంపై మరోసారి హిజ్బుల్లా మిలిటెంట్లు దాడికి తెగబడ్డారు. ఇజ్రాయిల్ మిలిటరీ పోస్టులపై 50కి పైగా రాకెట్లు ప్రయోగించించి, దాడికి పాల్పడింది. అంతకు ముందు రోజు ఇజ్రాయిల్, దక్షిణ లెబనాన్‌పై దాడి చేసి ఐదుగురు మిలిటెంట్లను చంపేసింది.

ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ప్రారంభమైన తర్వాత హమాస్‌కి హిజ్బుల్లా మద్దతు తెలిపింది. హమాస్ తరుపున యుద్దంలో పాల్గొంటామని వెల్లడించింది. అయితే ఇరాన్ వీరికి మద్దతు ఇస్తుందని ఇజ్రాయిల్ ఆరోపించింది. అక్టోబర్ 7 నాటి దాడిలో హమాస్ 1200 మంది ఇజ్రాయిల్ ప్రజలను చంపడమే కాకుండా.. 240 మందిని బందీలుగా చేసుకుంది. ఆ తర్వాత నుంచి గాజాపై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. ఇజ్రాయిల్ దాడుల్లో 13 వేల మంది మరణించారు.

Show comments