Donald Trump: ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ దిగిపోయే సమయం వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్ వ్యాప్తంగా వారాల తరబడి ఎగిసిపడిన నిరసనల తర్వాత అమెరికా నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ‘‘ఇరాన్‌లో కొత్త నాయకత్వం కోసం వెతకాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని అన్నారు. ఖమేనీ తన 37 ఏళ్ల పాలనకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. రెండు రోజు క్రితం 800 మందికి పైగా ప్రజల్ని ఉరి శిక్షల్ని ఆపరడం ఆయన తీసుకున్న అత్యుత్తమ నిర్ణయమని ట్రంప్ అన్నారు.
Read Also: Robotic Police: రోబోటిక్ పోలీసులు ఆన్ డ్యూటీ.. నిబంధనలను ఉల్లంఘించి తప్పించుకోవడం అసాధ్యం..
దేశాన్ని నడిపించడానికి ఇరాన్ నాయకత్వం అణిచివేత, హింసపై ఆధారపడుతోందని ట్రంప్ వాదించారు. దేశాన్ని పూర్తిగా నాశనం చేశాడని ఖమేనీని విమర్శించారు. దేశాన్ని సరిగా పాలించడం చేతకాక, అధికారంలో ఉండేందుకు వేల మందిని హతమార్చడం నాయకత్వం కాదని, నాయకత్వం అంటే గౌరవం, భయం, మరణం కాదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఖమేనీని ‘‘రోగిష్టి వ్యక్తి’’గా అభివర్ణించిన ట్రంప్.. ఇరాన్ మతపాలన దేశాన్ని నివసించడానికి అత్యంత దారుణమైన ప్రాంతంగా మార్చిందని అన్నారు.
దీనికి ముందు, ఇరాన్ పాలకుడు ఖమేనీ ట్రంప్‌పై విరుచుకుపడ్డాడు. ఇరాన్ పరిణామాలకు, చెడ్డ పేరుకు ట్రంప్ కారకుడని, ట్రంప్ ఓ క్రిమినల్ అని ఆరోపించారు. ఈ నిరసనల వెనక అమెరికా హస్తం ఉందని అన్నారు. దేశాన్ని అస్తవ్యస్తం చేసే వారిని ఉపేక్షించేది లేదని, ఈ అరాచకాలకు పాల్పడిన దేశీయ, అంతర్జాతీయ శక్తుల వెన్నువిరుస్తామని అన్నారు. ఇరాన్ ప్రభుత్వం ఈ ఆందోళనల్ని ఉగ్రవాద చర్యలుగా అభివర్ణించింది. భద్రతా దళాల కాల్పుల్లో కనీసం 3400 మందికి పైగా నిరసనకారులు మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి.