Israel-Iran War: ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్‌తో సహా IRGC కీలక కమాండర్ హతం

Israel Iran War (5)

Israel Iran War (5)

Israel-Iran War: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం భీకరంగా మారింది. ఈ యుద్ధంలో ఇజ్రాయిల్ అమెరికాలు కలిసి ఇరాన్‌పై దాడులు చేశాయి. మరోవైపు, ఇరాన్ కూడా మిడిల్ ఈస్ట్ లోని అమెరికా మిత్రదేశాలైన కువైట్, యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, జోర్డాన్ వంటి దేశాల్లో యూఎస్ మిలటరీ స్థావరాలపై దాడులు చేస్తోంది. ఇజ్రాయిల్‌పై ఇరాన్‌తో పాటు హౌతీలు, లెబనాన్‌లోని హిజ్బుల్లా కూడా దాడులు చేస్తోంది.

Read Also: Asaduddin Owaisi: ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడి గురించి ప్రధాని మోడీకి ముందే తెలుసా.?

ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీప్, మిలిటరీ కమాండర్ అమీర్ హతామీ మరణించినట్లు తెలుస్తోంది. అయితే, ఇరాన్ ప్రభుత్వం నుంచి మాత్రం ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. జూన్ 2025లో ఇజ్రాయిల్ దాడుల్లో అప్పటి ఆర్మీ చీఫ్ మహ్మద్ బఘేరీ చనిపోయిన తర్వాత హతామీ ఇరాన్ ఆర్మీ చీఫ్‌గా నియమితులయ్యారు. ఒక వేళ ఇదే నిజమైతే ఇరాన్ సైన్యానికి పెద్ద దెబ్బగా చెప్పవచ్చు.

హతామీ మరణంపై వార్తలు వచ్చిన కొద్దిసేపటికే మరో కీలక కమాండర్ మరణించాడని ఇజ్రాయిల్ ప్రకటించింది. ఇరాన్ అత్యంత శక్తివంతమైన సైనిక విభాగం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్((IRGC) కమాండర్ మహ్మద్ పాక్పూర్ కూడా తమ దాడుల్లో మరణించినట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. మహ్మద్ పాక్పూర్ ఇరాన్‌లోని శక్తివంతమైన సైనికాధికారుల్లో ఒకరు. ఇతను 200 రోజుల క్రితమే IRGC గ్రౌండ్ ఫోర్సెస్ కమాండర్ బాధ్యతల్ని చేపట్టతారు.