Iran: అలీ లారిజానీ స్థానం భర్తీ.. కొత్త భద్రతా చీఫ్‌గా బఘేర్ నియామకం
- ఇరాన్లో అలీ లారిజానీ స్థానం భర్తీ
- కొత్త భద్రతా చీఫ్‌గా బఘేర్ నియామకం
- ఇటీవలే లారిజానీని చంపేని ఇజ్రాయెల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కుడి భుజం.. ఇరాన్ అత్యున్నత భద్రతా అధికారి అలీ లారిజానీని ఇజ్రాయెల్ ఒక ప్రణాళికతో అంతమొందించింది. దీంతో ఇరాన్ అత్యున్నత పవర్ఫుల్ నాయకులను కోల్పోవల్సి వచ్చింది.

Also Read
- Abqaiq Refinery Fire: ఇరాక్ డ్రోన్ దాడులు.. సౌదీ అరేబియాలోని అబ్కైక్ ఆయిల్ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం
- Trump: చర్చలు విఫలమైతే ఇరాన్‌పై భారీ దాడులుంటాయి.. ట్రంప్ వార్నింగ్
- Netanyahu: వస్తున్నా.. దమ్ముంటే అరెస్ట్ చేయండి.. న్యూయార్క్ మేయర్‌కు నెతన్యాహు సవాల్
- Pakistan: అసిమ్ మునీర్ చేతుల్లోకి పాకిస్తాన్.. సైన్యం వద్ద ‘‘న్యూక్లియర్ బటన్’’..
తాజాగా అలీ లారిజానీ స్థానాన్ని ఇరాన్ భర్తీ చేసింది. ఇరాన్ కొత్త భద్రతా అధిపతిగా మహమ్మద్ బఘేర్ జోల్ఘదర్‌ను నియమించింది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శిగా మహమ్మద్ బఘేర్ జోల్ఘదర్ నియమితులైనట్లుగా ఇరాన్ ప్రభుత్వం తెలిపింది.
ఐఆర్‌జీసీతో జోల్ఘదర్కు ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా నియామకం జరిగినట్లుగా తెలుస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్‌లతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో భద్రతాకు సంబంధించిన నాయకత్వం అత్యంత ముఖ్యమైందిగా ఇరాన్ భావించింది. ఈ నేపథ్యంలో జోల్ఘదర్ నియామకం వేగంగా జరిగింది.
అలీ లారిజానీ..
అలీ లారిజానీ ఇరాన్లో అత్యున్నత పదవిలో ఉన్న ప్రముఖుడు. అయతుల్లా అలీ ఖమేనీకి అత్యంత సన్నిహితుడు. కుడి భుజం. అపారమైన అనుభవం ఉంది. వ్యవస్థలను సమర్థవంతంగా నడిపించగల సామర్థ్యం ఉంది. అంతేకాకుండా అంతర్జాతీయ భాగస్వాములతో సంప్రదింపులు జరపడంలో మంచి నైపుణ్యం ఉంది. ఇక అలీ లారిజానీ అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో ఉంటారు. శత్రువుకు చిక్కకుండా రహస్య స్థావరాలు మారుతుంటారు. అలాంటిది ఇజ్రాయెల్‌కు చిక్కడం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఐడీఎఫ్ టార్గెట్ చేసి చంపేసింది. దీంతో ఇరాన్ భారీ షాక్‌కు గురైంది. ఈనెల 18న అలీ లారిజానీ, అతని కుమారుడు మోర్టెజా లారిజానీ, అతని భద్రతా సిబ్బంది హతమైనట్లుగా ఇరాన్ అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Tollywood: టాలీవుడ్లో గాయాల షాక్.. ‘బాబాయ్-అబ్బాయి’ జంటలకు సర్జరీలు, షూటింగ్‌లపై ప్రభావం!
-
Parliament Monsoon Session 2026: నేటి నుంచి సజావుగా పార్లమెంట్ సమావేశాలు.. స్పీకర్ ఓం బిర్లా చొరవతో తొలగిన ప్రతిష్టంభన
-
Team India Schedule: జింబాబ్వే సిరీస్ ముగిసింది.. టీమిండియా వాట్ నెక్స్ట్.?
-
Vivo T5e: వివో T5e భారత్‌లో లాంచ్.. రూ.13,999కే 5,500mAh బ్యాటరీ, AI ఫీచర్లు, మిలిటరీ-గ్రేడ్ డ్యురబిలిటీ
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే!
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!