Iran-Hormuz: హార్ముజ్‌పై ఇరాన్ సంచలన నిర్ణయం.. కొత్త టెన్షన్ మొదలైనట్లేనా?
- హార్ముజ్‌పై ఇరాన్ సంచలన నిర్ణయం
- శత్రు దేశాలపై ఇరాన్ ప్రతీకారం
- హార్ముజ్ మూసేస్తున్నట్లు ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా యుద్ధం మరింత ముదురుతున్నట్లుగా కనిపిస్తోంది. గత 28 రోజులుగా జరుగుతున్న యుద్ధం తీవ్రం అవుతోంది. ట్రంప్ చర్చలకు పిలుస్తున్నా.. ఇరాన్ మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమెరితో ఎలాంటి చర్చలు లేవని తేల్చి చెబుతోంది. అంతేకాకుండా తాజాగా మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

Also Read
- US Iran War: జోర్డాన్ దాడికి ప్రతీకారం.. ఇరాన్‌పై అమెరికా దాడులు..
- China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
- Russia-Telegram: టెలిగ్రామ్ వ్యవస్థాపకుడిపై ఉగ్రవాద ఆరోపణలు.. రష్యా సంచలన నిర్ణయం
- PoK Protest: వారు కూడా భారత్ లాంటి శత్రువులే.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
అమెరికా, ఇజ్రాయెల్ మిత్రదేశాలకు హార్ముజ్‌ను మూసేస్తున్నట్లు ఇరాన్ ఐఆర్జీసీ ప్రకటించింది. శత్రువులతో కలిసుండే దేశాలకు ఏ మాత్రం అనుమతి ఇవ్వబోమని పేర్కొంది. ఇప్పటికే ఆయా దేశాలకు చెందిన మూడు నౌకలను కూడా వెనక్కి పంపేసినట్లు వెల్లడించింది. ఇక అమెరికా బలగాలు ఉన్న ప్రాంతంలోని పౌరులు దూరంగా వెళ్లిపోవాలని ఇరాన్ హెచ్చరించింది.
ఇరాన్ చేసిన తాజా హెచ్చరికలు మరింత ఉద్రిక్తతలకు దారి తీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత నెల రోజులుగా జరుగుతున్న యుద్ధంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. కోట్లాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు ఇరాన్ సిద్ధపడుతోంది.
హార్ముజ్ జలసంధిని తెరవకపోతే విద్యుత్ ప్లాంట్లపై దాడి చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇక ఇరాన్ ప్రాధేయపడడంతోనే చర్చల కోసం ఐదు రోజులు దాడులు ఆపేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. తాజాగా ఆ గడువు కూడా ఏప్రిల్ 6 వరకు పెంచారు. కానీ ట్రంప్ ప్రకటనకు వ్యతిరేకంగా ఇరాన్ స్పందిస్తోంది. అమెరికాతో ఎలాంటి చర్చలు లేవని.. అమెరికా భూతల దాడులు చేస్తే.. తాము కూడా గల్ఫ్ దేశాలపై దాడి చేస్తామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయోనని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గత నెల 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సహా కీలక అధికారులంతా హతమయ్యారు. అంతేకాకుండా అనంతరం దాడుల్లో ఇరాన్లో కీలక నేతలంతా ఒక్కొక్కరిగా హతమయ్యారు. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రతీకార దాడులతో చెలరేగిపోతుంది. గల్ఫ్ దేశాలపై భీకర దాడులు చేస్తోంది. ఈ కారణంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి.
తాజావార్తలు
-
Bank Holidays August 2026: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. ఆగస్టులో సగం రోజులు సెలవులే..!
-
India On PoK: ‘‘పాకిస్తానీ కాశ్మీర్ అనేదే లేదు’’.. NYT కథనంపై భారత ఆగ్రహం
-
Stephen Fleming Coach: మొదటిసారి కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్.. కీలక మార్పులకు నాంది!
-
Suriya47: దీపావళి బరిలో ‘సూర్య47’?.. హ్యాట్రిక్ రిలీజ్‌కు స్టార్ హీరో రెడీ!
-
Dhanush : ధనుష్ నెక్ట్స్ లక్ష్యం రాజకీయాలేనా…? అగ్రెసివ్ స్పీచ్ ఇచ్చి ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టాడా..?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!