Site icon NTV Telugu

Iran: ఇరాన్ కీలక ప్రకటన.. ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ జరిగినట్లు ప్రకటన

Iranus

Iranus

ఇజ్రాయెల్‌తో యుద్ధం ముగిసినట్లుగా ఇరాన్ ప్రకటించింది. ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ జరిగినట్లుగా తాజాగా ఇరాన్ ప్రభుత్వ మీడియా అంగీకరించింది. తొలుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్… ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ జరిగినట్లుగా సోషల్ మీడియాలో తెలిపారు. 24 గంటల్లో దశల వారీగా కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. మొదట ట్రంప్ ప్రకటనతో ఇరాన్ అంగీకరించలేదు. అలాంటిది ఏమీ లేదని పేర్కొంది. ఇంతలోనే ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి ప్రయోగించింది. ముగ్గురు చనిపోయారు. భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడి అనంతరం తాజాగా కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్లుగా ఇరాన్ ప్రకటించింది.

ఇది కూడా చదవండి: Vishwambhara : చిరుతో స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేయనున్న ‘నిశ్విక నాయుడు’

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య 12 రోజులుగా భీకర దాడులు జరిగాయి. జూన్ 13న ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేసింది. ఇంతలో అమెరికా జోక్యం పుచ్చుకుని ఇరాన్‌లోని మూడు ముఖ్యమైన అణు కేంద్రాలను ధ్వంసం చేసింది. అనంతరం ఇజ్రాయెల్ కూడా దాడులు చేసి పూర్తిగా ధ్వంసం చేసింది. మొత్తానికి మంగళవారం ఉదయం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగినట్లుగా ట్రంప్ వెల్లడించారు. తొలుత ఇరాన్ అంగీకరించలేదు. తాజాగా కాల్పుల విరమణ జరిగినట్లుగా ఇరాన్ పేర్కొంది.

ఇది కూడా చదవండి: Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

Exit mobile version