NTV Telugu Site icon

Anant-Radhika wedding: పెళ్లికి వస్తూ లగేజీ పోగొట్టుకున్న ఇన్‌ఫ్లుయెన్సర్ జూలియా

En

En

యూఎస్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ జూలియా చాఫే ఎయిర్‌పోర్టులో తన లగేజీ పోగొట్టుకుంది. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల పెళ్లి కోసం భారత్‌కు వస్తున్నప్పుడు ఎయిర్‌లైన్‌లో తన లగేజీని పోగొట్టుకుంది. ఈ మేరకు ఆమె వీడియో ద్వారా సమాచారాన్ని తెలియజేసింది. తన సామాగ్రి విషయంలో సహకారం చేయాలని కోరింది. మొత్తానికి ఆమె తిరిగి తన లగేజీని పొందుకోగలిగింది. ఇదిలా ఉంటే అనంత్ అంబానీ వివాహానికి సంబంధించి గ్రాండ్ సెలబ్రేషన్స్‌ను నెలల తరబడి వీడియోలు తీస్తూ పోస్టు చేస్తోంది.

ఇది కూడా చదవండి: Kandi Pappu: తక్కువ ధరకే కందిపప్పు.. క్యూకట్టిన ప్రజలు

యూఎస్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ జూలియా చాఫేను అంబానీ ఫ్యామిలీ జూలై 12న ముంబైలో జరిగే వివాహ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇందుకోసం చాఫే ఇండియాకు వస్తుండగా ఏజియన్ ఎయిర్‌లైన్స్‌లో లగేజీ మిస్ అయింది. దీంతో ఆమె ఏథెన్స్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపింది. అనంత్ అంబానీ-రాధిక పెళ్లికి వెళ్తున్నానని సహాయ చేయాలని కోరింది. ఆమె అనుచరుల సహాయంతో తిరిగి లగేజీ దక్కించుకుంది. దీంతో ఆమె సంతోషానికి అవధులు లేవు. దీనికి సంబంధించిన వీడియోలను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టు చేసింది. ఎయిర్‌పోర్టులో తన బ్యాగ్‌లను పొందుతున్న వీడియోను ఆమె షేర్ చేసింది.

Show comments