US: అమెరికాలో ఘోరం.. స్టోర్లో భారతీయ మహిళను కాల్చి చంపిన దుండగుడు.. వీడియో వైరల్
- అమెరికాలో మరో ఘోరం
- స్టోర్లో భారతీయ మహిళను కాల్చి చంపిన దుండగుడు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్ర రాజ్యం అమెరికాలో భారతీయులకు మరో ఘోరం జరిగిపోయింది. గుజరాత్కు చెందిన భారతీయ మహిళను అత్యంత దారుణంగా దుండగుడు తుపాకీతో కాల్చి చంపాడు. ఈ దారుణ ఘటన వర్జీనియాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ కాగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దుర్ఘటన భారతీయుల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తించాయి.

Also Read
గుజరాత్లోని మోహసానా జిల్లాకు చెందిన 45 ఏళ్ల మేఘనా పటేల్ 10 ఏళ్ల నుంచి అమెరికాలోని వర్జీనియాలో నివాసం ఉంటూ ఒక సూపర్ మార్కెట్లో పని చేస్తోంది. అయితే ఈ నెల 23న స్టోర్లో కస్టమర్లు ఎవరూ లేరు. అలాంటి సమయంలో ఒక వ్యక్తి కస్టమర్ వేషంలో సూపర్ మార్కెట్లోకి వచ్చాడు. ప్యాంట్, జాకెట్, గ్లవ్స్, మాస్క్, టోపీ ధరించి.. మేఘనా పటేల్ ఉన్న కౌంటర్ దగ్గరకు వచ్చాడు. ఆమెతో ఏదో మాట్లాడుతున్నట్లుగా కొద్దిసేపు నటించాడు. అంతలోనే అకస్మాత్తుగా జేబులో నుంచి తుపాకీ తీసి కాల్పులకు తెగబడ్డాడు. బుల్లెట్లు తలలోకి దూసుకెళ్లడంతో కౌంటర్ దగ్గరే మేఘనా కుప్పకూలిపోయింది. అంతటితో ఆగని దుండగుడు కౌంటర్ లోపలికి తొంగి చూసి మరోసారి కాల్పులకు పాల్పడ్డాడు. అనంతరం టేబుల్ దగ్గర ఉన్న కొన్ని వస్తువులు తీసుకుని పరారయ్యాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు పాయింట్.. పాయింట్ సీసీటీవీలో రికార్డయ్యాయి.
మేఘనా పటేల్ మరణవార్త తెలుసుకున్న గుజరాత్లోని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆమె తల్లిదండ్రులు కర్సన్భాయ్ పటేల్, కపిలాబెన్ ప్రస్తుతం గుజరాత్లోనే నివసిస్తున్నారు. భర్త ఉపేంద్రభాయ్ పటేల్, కుమార్తె నక్షిబెన్, కుమారుడు స్మిత్ మాత్రం అమెరికాలో స్థిరపడ్డారు. ఇక ఈ ఏడాది అమెరికాలో హత్యకు గురైన నాలుగో గుజరాతీ వ్యక్తిగా మేఘనా పటేల్ నిలిచారు. ఈ ఘటనపై అమెరికాలోని గుజరాతీ సమాజం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
🇺🇸 #Virginia, USA — A 45-year-old Indian woman from Gujarat was shot dead inside a supermarket during a suspected robbery attempt. pic.twitter.com/2YIIUtPeVL
— World Wide Leak (@leaklive1) May 26, 2026
తాజావార్తలు
-
Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!