ఆస్ట్రేలియాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సిడ్నీ సమీపంలో బీఎండబ్ల్యూ కారు ఢీకొని 8 నెలల భారతీయ గర్భిణీ సమన్విత ధరేశ్వర్ (33) ప్రాణాలు కోల్పోయింది. మరికొద్ది రోజుల్లో రెండో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధపడుతున్న తరుణంలో తుదిశ్వాస విడవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
నవంబర్ 14న సిడ్నీలోని ఒక పార్కు దగ్గర రోడ్డు దాటుతుండగా ఒక్కసారిగా కారు దూసుకొచ్చింది. దీంతో ధరేశ్వర్ తీవ్రగాయాలు పాలై ప్రాణాలు కోల్పోయింది. 19 ఏళ్ల కుర్రాడు కారును నడుపుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ధరేశ్వర్ది కర్ణాటక ప్రాంతం. సిడ్నీలో ఐటీ ప్రొఫెషనల్‌గా పని చేస్తున్నారు. ఆమె భర్త వినీత్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నారు. దురదృష్టకరమైన రోడ్డు ప్రమాదంలో ధరేశ్వర్ ప్రాణాలు కోల్పోయింది.
ఇది కూడా చదవండి: Trump-Elon Musk: వైట్‌హౌస్‌లో ప్రత్యక్షమైన మస్క్.. సౌదీ రాజుకు ఇచ్చిన విందులో హల్చల్
ప్రమాద స్థలంలోనే ధరేశ్వర్‌కు తీవ్రగాయాలు అయినట్లుగా పోలీసులు తెలిపారు. నవంబర్ 14న మూడేళ్ల కొడుకుతో వినీత్, ధరేశ్వర్ నడుచుకుంటూ వెళ్తున్నారు. వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ధరేశ్వర్‌కు తీవ్రగాయాలయ్యియి. ప్రాథమిక చికిత్స తర్వాత సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. పుట్టబోయే బిడ్డతో పాటు ధరేశ్వర్ ప్రాణాలు విడిచింది. నిందితుడికి మూడేళ్ల వరకు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.